వివో ఇండియా కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తోంది. అదే, Vivo V30e స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ ను కూడా కంపెనీ ముందే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా సామ్రాట్ ఫోన్ లకు గట్టి పోటీ గా నిలబెట్టేలా తీసుకు వస్తున్నట్లు ఈ ఫోన్ ఫీచర్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
వివో వి 30 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ సేల్ పార్ట్నర్ గా Flipkart వ్యవహరిస్తోంది మరియు Flipkart ప్రకటించిన Big Saving Days మొదటి రోజునే ఈ ఫోన్ లాంచ్ అవ్వడం కూడా విశేషంగా చెప్పవచ్చు.
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను కొత్త స్టన్నింగ్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ కలిగిన కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కంపెనీ ముందు నుంచి టీజ్ చేస్తోంది. ఈ ఫీచర్స్ ఈ యొక్క టాప్ ఫీచర్స్ గా వివో చెప్పకనే చెబుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
వివో వి30e స్మార్ట్ ఫోన్ ను Luxury Inspired కలర్ ఆప్షన్ లతో Silk Blue మరియు Velvet Red రెండు కలర్ లలో అందిస్తోంది. ఈ వివో అప్ కమింగ్ లో అల్ట్రా స్లిమ్ 3D Curved డిస్ప్లే ఉన్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ డిస్ప్లే ఎగువ మధ్య భాగంలో 50MP Eye AF సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా వివో టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్, కలర్ మరియు డిస్ప్లే పరంగా చాలా అందంగా కనిపిస్తోంది.
Also Read: Google Play Store నుంచి 22 లక్షల Malware Apps ని బ్యాన్ చేసిన గూగుల్.!
ఇక వివో రెండవ బెస్ట్ ఫీచర్ గా ఈ ఫోన్ లో అందించిన కెమెరా గురించి చెబుతోంది. ఈ ఫోన్ లో Aura Light Portrait కలిగిన కెమెరా సెటప్ వుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వుంది మరియు దానికి జతగా ఆరా లైట్ కూడా వుంది. ఇందులో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా 50mm ఫోకాల్ లెంగ్త్ తో ఉంటుందని కంపెనీ తెలిపింది. అందుకే, ఈ ఫోన్ DSLR వంటి గొప్ప డీటెయిల్స్ కలిగిన ఫోటోలు అందించే సత్తాని కలిగి ఉంటుందని కూడా వివో గొప్పగా చెబుతోంది.
వివో వి30e ఫోన్ ను 4-year బ్యాటరీ హెల్త్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది, అని కూడా వివో తెలిపింది. అతి సన్నని డిజైన్ లో 5500 mAh బ్యాటరీ కలిగిన ఫోన్ లలో ఇది ముందు ఉంటుంది, అని కూడా వివో టీజింగ్ చేస్తోంది.