Vivo V30: స్టన్నింగ్ డిజైన్ మరియు ప్రత్యేకతలతో వచ్చిన వివో కొత్త ఫోన్.!

Vivo V30: స్టన్నింగ్ డిజైన్ మరియు ప్రత్యేకతలతో వచ్చిన వివో కొత్త ఫోన్.!
HIGHLIGHTS

ఈరోజు భారత్ మార్కెట్ లో వి 30 సిరీస్ ను విడుదల చేసింది

30 మరియు వి30 ప్రో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

వి30 స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో భారీ కెమేరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ తో తీసుకు వచ్చింది

Vivo V30: వివో ఇండియా ఈరోజు భారత్ మార్కెట్ లో వి 30 సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి వి30 మరియు వి30 ప్రో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ లలో వి30 స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో భారీ కెమేరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ తో తీసుకు వచ్చింది. ఈరోజే ఇండియాలో సరికొత్తగా విడుదలైన ఈ లేటెస్ట్ వివో వి30 యొక్క ధర స్పెక్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Vivo V30: Price

వివో వి30 స్మార్ట్ ఫోన్ ను రూ. 38,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ కోసం ఈ ధరను నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 8GB + 256GB ని రూ. 40,999 ధరతో ప్రకటించింది. ఇక హై ఎండ్ వేరియంట్ 12GB + 256GB ని రూ. 42,999 ధరతో అందించింది. ఈ ఫోన్ యొక్క Pre Booking లను కూడా ఈరోజు నుండే మొదలు పెట్టింది.

Launch Offers

ఈ ఫోన్ పైన గొప్ప లాంఛ్ ఆఫర్లను కూడా వివో అందించింది. ఈ ఫోన్ లను HDFC మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ & EMI ఆప్షన్ లతో కొనే వారికి 10% అధనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పైన రూ. 3,500 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా లభిస్తుంది.

Also Read: రూ. 1,099 ధరకే కొత్త Smart Watch విడుదల చేసిన ఐటెల్.!

Vivo V30 Specs

వివో వి 30 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ చాలా సన్నని మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే 1బిలియన్ కలర్స్ సపోర్ట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి వుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరా వుంది.

వివో వి 30 ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ 5జి ప్రోసెసర్ Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు జతగా 12GB RAM తో అందించింది. ఈ ఫోన్ లో (UFS3.1) 128GB మొదలుకొని 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లను కూడా జత చేసింది. ఈ ఫోన్ వివో లేటెస్ట్ Funtouch OS 14 Global సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుంది.

కెమేరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50 MP (AF+OIS) మెయిన్ + 50 MP AF అల్ట్రా వైడ్ సెన్సార్ లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ మెయిన్ కెమేరాతో కొత్త స్టూడియో క్వాలిటీ Aura Light ని కూడా జత చేసింది. ఈ ఈ సెటప్ తో అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలను షట్ చేయవచ్చని వివో తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo