Vivo V30 Series: Zeiss ఆప్టిక్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వివో.!

Updated on 26-Feb-2024
HIGHLIGHTS

Vivo V30 Series ను ఇండియాలో లాంఛ్ చేయడానికి సిద్దమయ్యింది

మార్చి 7న భారత్ మార్కెట్ లాంఛ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది

Zeiss ఆప్టిక్స్ సపోర్ట్ తో లాంఛ్ చేస్తున్నట్లు కూడా Vivo అనౌన్స్ చేసింది

Vivo V30 Series: వివో వి30 సిరీస్ ను ఇండియాలో లాంఛ్ చేయడానికి సిద్దమయ్యింది. వివో యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను మార్చి 7న భారత్ మార్కెట్ లాంఛ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్ డేట్ తో పాటుగా అందించిన టీజర్ ఇమేజ్ లతో టీజింగ్ మొదలు కూడా పెట్టింది. వి30 సిరీస్ నుండి వి30 మరియు వి30 ప్రో ఫోన్ లను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లను Zeiss ఆప్టిక్స్ సపోర్ట్ తో లాంఛ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది.

Vivo V30 Series

వివో వి30 సిరీస్ నుండి లాంఛ్ చేయబోతున్న వి30 మరియు వి30 ప్రో స్మార్ట్ ఫోన్స్ ఇమేజెస్ తో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ వివో వి30 సిరీస్ ను జియస్ ఆప్టిక్స్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ టీజర్ పేజ్ నుండి అందించిన ఇమేజ్ ద్వారా చూపించింది. వివో వి30 సిరీస్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.

Also Read: QLED TV: భారీ డిస్కౌంట్ తో 30 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ..!

Zeiss Optics Camera

వివో వి30 సిరీస్ లో జీయస్ ఆప్టిక్స్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ కెమేరా సిస్టం ఉన్నట్లు టీజింగ్ ఇమేజ్ ద్వారా అర్ధమే అవుతోంది. ఈ ఫోన్ లో Aura Light OIS Portrait ఉన్నట్లు కూడా ఫోన్ ఇమేజ్ ద్వారా క్లియర్ అవుతోంది. అయితే, ఇక్కడ కంపెనీ టీజింగ్ ద్వారా అందించిన ఇమేజ్ వివో వి30 ప్రో ఫోన్ అని కూడా నోట్ లో తెలిపింది.

వివో వి30 ప్రో

వివో అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి అందించిన టీజింగ్ ట్వీట్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ డిజైన్, కర్వ్డ్ డిస్ప్లే, ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వస్తుందని హింట్ ఇచ్చింది. వివో వి30 ప్రో టీజర్ ఇమేజ్ లను చూస్తుంటే ఈ ఫోన్ లో సెగ్మెంట్ టాప్ క్లాస్ కెమేరా మరియు ఇతర ఫీచర్లు ఉండవచ్చని, అంచనాలు వేస్తున్నారు.

అయితే, వివో వి30 సిరీస్ లాంఛ్ కోసం ఇంకా చాలా సమయం ఉన్నది కాబట్టి, ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను టీజర్ పోస్టర్ మరియు ట్వీట్స్ ద్వారా అందిస్తుందని, మనం ఆశాబావం వ్యక్తం చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :