Vivo V30 Pro: టాప్ – 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!

Updated on 07-Mar-2024
HIGHLIGHTS

వివో ఈరోజు ఇండియాలో వివో వి 30 సిరీస్ ను ప్రవేశపెట్టింది

Vivo V30 Pro ను భారీ కెమేరా సెటప్ తో తీసుకు వచ్చినట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది

వివో వి 30 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో విడుదల చేసింది

Vivo V30 Pro: వివో ఈరోజు ఇండియాలో వివో వి 30 సిరీస్ ను ప్రవేశపెట్టింది. ఇందులో, Vivo V30 Pro ను భారీ కెమేరా సెటప్ తో తీసుకు వచ్చినట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది. అయితే, కేవలం కెమేరా ఒక్కటి మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లు కూడా ఔరా అనిపించేలా వున్నాయి. అందుకే, వివో వి 30 స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ – 5 ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.

Vivo V30 Pro: Price

వివో వి 30 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. ఈ వేరియంట్ ధరలను ఈ క్రింద చూడవచ్చు.

వివో వి 30 ప్రో (8GB+256GB) ధర : రూ. 41,999

వివో వి 30 ప్రో (12GB+512GB) ధర : రూ. 46,999

వివో వి30 ప్రో ఆఫర్స్

Vivo V30 Pro Price and Offers

వివో వి30 ప్రో స్మార్ట్ ఫోన్ పైన బెస్ట్ ఆఫర్లను కూడా వివో జత చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ మరియు EMI ఆప్షన్ తో ఈ ఫోన్ కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 4,000 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందించింది.

Vivo V30 Pro టాప్ – 5 ఫీచర్లు

Vivo V30 Pro టాప్ – 5 ఫీచర్లు

Display

ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేని 1.5 K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800 నిట్స్ లోకల్ బ్రైట్నెస్, 1 బిలియన్ కలర్ మరియు P3 కలర్ గ్యాముట్ తో వస్తుంది.

Processor

వివో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 8200 పవర్ ఫుల్ మిడ్ రేంజ్ ప్రోసెసర్ తో అందించింది. ఈ ప్రోసెసర్ 3.1 GHz క్లాక్ స్పీడ్, Amm Mali-G610 GPU తో వస్తుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో LED ధరకే పెద్ద QLED Smart Tv లభిస్తోంది.!

RAM & ROM

ఈ ఫోన్ 12 GB RAM + 12 GB Extended RAM లతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించ గలదని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 512 GB ROM (ఇంటర్నల్ స్టోరేజ్) తో ఎక్కువ స్టోరేజ్ కూడా లభిస్తుంది.

Camera

ఈ వివో స్మార్ట్ ఫోన్ అద్భుతమైన కెమేరా సెటప్ మరియు ఫీచర్స్ ను కలిగి ఉన్నట్లు వివో గొప్పగా చెబుతోంది. వివో వి 30 ప్రో ఫోన్ లో 50 MP AF + (OIS Sony IMX920) మెయిన్ + 50 MP AF (Sony IMX816) పోర్ట్రైట్ + 50 MP AF అల్ట్రా వైడ్ సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50 MP AF సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ సెటప్ ను Zeiss Optics కూడా అందించింది.

Vivo V30 Pro Camera

ఈ ఫోన్ కెమేరాతో అద్భుతమైన Zeiss Camera ఫిల్టర్స్ ను కూడా జత చేసింది. ఇందులో, స్టన్నింగ్ ఫోటోలు మరియు హైరెజల్యూషన్ వీడియోలను షూట్ చేయవచ్చని వివో తెలిపింది.

Battery & Charge

వివో వి 30 స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది. ఈ బిగ్ బ్యాటరీని అత్యంత వేగంగా ఛార్జ్ చెయ్యగల 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :