vivo V29e 5G: రేటు తక్కువ..రేంజ్ ఎక్కువ..ఈసారి వివో అదరగొట్టే ఫోన్ లాంచ్ చేసిందిగా.!

vivo V29e 5G: రేటు తక్కువ..రేంజ్ ఎక్కువ..ఈసారి వివో అదరగొట్టే ఫోన్ లాంచ్ చేసిందిగా.!
HIGHLIGHTS

వివో ఈరోజు ఇండియాలో vivo V29e 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

V29e ని 5G 30 వేల బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా వివో జత చేసింది

వివో ఈరోజు ఇండియాలో vivo V29e 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 30 వేల బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ చాలా అందమైన డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా వివో జత చేసింది. vivo V29e 5G స్మార్ట్ ఫోన్ ధర, అఫర్, స్పెక్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి. 

vivo V29e 5G: ప్రైస్ & ఆఫర్స్ 

vivo V29e 5G స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ వివో V29e 5G స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB+128GB) ను రూ. 26,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 8GB మరియు 256GB స్టోరేజ్ తో రూ. 28,999 ధరతో లాంచ్ చేసింది. ఈ V29e 5G ఫోన్ ఆర్టిస్టిక్ రెడ్ మరియు ఆర్టిస్టిక్ బ్లూ అనే రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు నుండి Pre-Book చేసుకోవచ్చు.   

ఆఫర్స్: వివో ఈ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. V29e 5G స్మార్ట్ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా ఫుల్ పేమెంట్ కొనుగోలు చేసే వారు లేదా EMI ద్వారా కొనేవారికి రూ. 2,500 భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అయితే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ఆగష్టు 28 నుండి సెప్టెంబర్ 13వ తేదీ వరకూ మాత్రమే వర్తిస్తుంది.      ఈ ఫోన్ తో ఎక్స్ చేంజ్ పైన కూడా రూ. 2,000 బిగ్ బోనస్ అడిషనల్ ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది.

ఈ అఫర్ ల ద్వారా ఈ ఫోన్ ను మీరు చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం వివో అందించింది.

vivo V29e 5G: స్పెక్స్ & ఫీచర్స్ 

వివో V29e 5G స్మార్ట్ ఫోన్ ను 7.57mm మందంతో చాలా సన్నగా కర్వ్డ్ డిస్ప్లే మరియు కర్వ్డ్ డిజైన్ తో చాలా చాలా అందంగా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ సైజ్ గల AMOLED 3D Curved డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో అందించింది. ఈ ఫోన్ చేతిలో చక్కగా ఇమిడి పోతుంది మరియు ప్రీమియం లుక్ తో వస్తుంది.

vivo V29e 5G launched 

ఈ ఫోన్ లో క్వాల్కమ్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Sanapdragon 695 5G ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. అయితే, దీనికి జతగా ఫోన్ 8GB ర్యామ్ మరియు Extended RAM 3.0 తో ర్యామ్ ను మరింత పెంచగల సామర్ధ్యంతో అందించింది. ఈ ఫోన్ లో 128GB మరియు 256GB స్టోరేజ్ అప్షన్ లతో వస్తుంది. ఈ వివో ఫోన్ Funtouch OS 13 Global పైన పని చేస్తుంది. 

ఈ ఫోన్ లో మంచి కెమేరా సెటప్ ను వివో అందించింది. vivo V29e 5G స్మార్ట్ ఫోన్ వెనుక 64 MP OIS మరియు 8 MP వైడ్-యాంగిల్ కెమేరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో అనేకమైన కెమేరా ఫిల్టర్ లను వివో జత చేసింది. కెమేరా పరంగా వివో ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాగే, ముందు భాగంలో సెల్ఫీల కోసం 50MP AF సెల్ఫీ కెమేరాని కూడా ఈ వివో ఫోన్ ఫోన్ కలిగి వుంది.

 vivo V29e 5G battery

vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చెయ్యగల 44W Flash Charge సపోర్ట్ తో అందించింది. 

ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న 3D Curved డిస్ప్లే, బిగ్ బ్యాటరీ& ఫాస్ట్ ఛార్జ్ టెక్ మరియు డీసెంట్ కెమేరా ల కాంబినేషన్ లో ఈ ఫోన్ ను వివో తీసుకు వచ్చింది. స్పెక్స్ వివరాలను బట్టి ఈ ఫోన్ రిజనబుల్ గా కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ రివ్యూ చేసిన తరువాత ఖచ్చితమైన వివరాలను అందించ గలుగుతాము.

 

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo