Vivo v29 Series Launch డేట్ అనౌన్స్ చేసిన వివో..ఫీచర్స్ ఇవేనంట| Tech news

Vivo v29 Series Launch డేట్ అనౌన్స్ చేసిన వివో..ఫీచర్స్ ఇవేనంట| Tech news

వివో గత కొంత కాలంగా ఊరిస్తున్న Vivo v29 Series Launch డేట్ అనౌన్స్ చేసిన వివో. ఇప్పటికే వరుసగా 3D Curved Display తో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న వివో ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్ లను కూడా కర్వ్డ్ డిస్ప్లే తోనే విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది. ఇందులో, v29 మరియు v29 Pro ఉంటాయని చెబుతున్నారు. ముందు నుండే వివో వి29 సిరీస్ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో టీజింగ్ మొదలు పెట్టిన వివో ఈరోజు లాంచ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది.

launch date in india

వివో వి29 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో అక్టోబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు డేట్ ప్రకటించింది. ఈ లాంచ్ డేట్ గురించి టీజర్ వీడియోని వివో అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను రిలీజ్ చేసింది.

Also Read: Surprising News: ఇక ఈ ఫోన్ లలో WhatsApp పనిచెయ్యదు..ఎందుకంటే.!

Teased Specs

వివో ఈ అప్ కమింగ్ సామ్రాట్ ఫోన్ సిరీస్ గురించి మరియు వీటి ఫీచర్స్ గురించి చాలా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లలో Ultra Slim 3D Curved Display ఉన్నట్లు కంపెనీ టీజర్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ India’s 1st 3D Particle Technology కలిగిన ఫోన్ అవుతుందని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్ లో వస్తుందని కూడా వివో సూచించింది.

Vivo v29 Series Launch date
Launch date

ఈ వివో అప్ కమింగ్ సిరీస్ హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్ మరియు స్పేస్ బ్లాక్ మూడు కలర్ లలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో Aura Light OIS కెమేరా సెటప్ వుంది. వివో వి29 Series ఇండియన్ వేరియంట్ గురించి వివో ప్రస్తుతానికి ఈ వివరాలను మాత్రమే అందించింది.

Also Read: 8 వేల రూపాయల బడ్జెట్ లో Smart Tv కోసం చూస్తున్నారా|Tech News

Vivo v29 Series Design

వివో ఈ ఫోన్ డిజైన్ ను చాలా ఆకర్షణీయంగా మరియు చాలా సన్నగా చేతిలో ఈజీగా ఉండేలా చేసినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు వెనుక కెమేరా జతచేసిన భాగం చాలా అట్రాక్టివ్ గా కనిపించేలా పెద్దగా చూపించే ప్రయత్నం చేసింది. ఈ వివో అప్ కమింగ్ ఫోన్స్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి మరిన్ని వివరాలను టీజర్ ద్వారా వివో అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo