ViVO V27 Pro: డిఫరెంట్ డిజైన్ తో వచ్చిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్లు ఇవే.!

ViVO V27 Pro: డిఫరెంట్ డిజైన్ తో వచ్చిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్లు ఇవే.!
HIGHLIGHTS

VIVO V27 సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

ViVO V27 Pro అధిక పెర్ఫార్మెన్స్ అందించే ప్రోసెసర్ తో అంధించబడింది

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి Pre-Oreders కి అందుబాటులోకి వచ్చింది

వివో ఈరోజు ఇండియాలో లేటెస్ట్ VIVO V27 సిరీస్ నుండి  రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ రెండు దాదాపుగా ఒకే ఫీచర్లను కలిగివున్నా ViVO V27 Pro అధిక పెర్ఫార్మెన్స్ అందించే ప్రోసెసర్ తో అంధించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి Pre-Oreders కి అందుబాటులోకి వచ్చింది. మరి ఈరోజే ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ధర,స్ స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.     

ViVO V27 Pro: ధర మరియు ఆఫర్లు

 వివో వి27 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB /128GB స్టోరేజ్ ధర రూ.37,999 మరియు 8GB /256GB స్టోరేజ్ ధర రూ.39,999. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ.42,999. ఈ ఫోన్ పైన కంపెనీ లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. HDFC/ICICI/KOTAK బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.3,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్చేంజ్ పైన 2,500 రూపాయల బోనస్ వంటి ఆఫర్లను అందించింది.  ఈ ఫోన్ vivo.com మరియు Flipkart నుండి ఈరోజు నుండి Pre-Oreders కి అందుబాటులోకి వచ్చింది.                                    

ViVO V27 Pro: స్పెసిఫికేషన్స్

ViVO V27 Pro: స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల FHD+ (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన 3D కర్వ్డ్ డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది  AMOLED ప్యానెల్‌ను ఉపయోగించింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కలర్ ఛేంజింగ్ గ్లాస్ ను అందించింది. వి 27 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌జతగా మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 8200 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన FuntouchOS 13 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

వివో వి 27 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP (OIS) Sony IMX766V ప్రాధమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. అయితే,ఈ ఫోన్ లో నైట్ పోర్ట్ రైట్ ఫోటోలను అందించడం కోసం Aura Lite ని అందించింది. ముందు వైపు, 50MP భారీ సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోనులో వివో అందించింది. V27 ప్రో 66W ఫ్లాష్ ఛార్జ్  సపోర్ట్ కలిగిన 4,600mAh బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo