Vivo V27 5G: ఈరోజు నుండి మొదలైన వివో లేటెస్ట్ ఫోన్ ముందస్తు బుకింగ్స్.!

Updated on 16-Mar-2023
HIGHLIGHTS

వివో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Vivo V27 5G స్మార్ట్ ఫోన్

Vivo V27 5G స్మార్ట్ ఫోన్ యొక్క ముందస్తు బుకింగ్స్ (Pre-Book) ఈరోజు నుండి మొదలయ్యాయి

ఈ ఫోన్ ను భారీ ఆఫర్లతో ముందుగా బుక్ చేసుకోవచ్చు

వివో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Vivo V27 5G స్మార్ట్ ఫోన్ యొక్క ముందస్తు బుకింగ్స్ (Pre-Book) ఈరోజు నుండి మొదలయ్యాయి. ఈ ఫోన్ కొత్త Aura Lite, సోనీ సెన్సార్ కలిగిన గొప్ప కెమేరా సెట్టింగ్ మరియు కలర్ చేంజింగ్ గ్లాస్ డిజైన్ తో పాటుగా మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచరతి ఈ ఫోన్ ను వివో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈరోజు నుండి ప్రీ-బుక్ కోసం అందుబాటులోకి వచ్చిన ఈ వివో లేటెస్ట్ ఫోన్ స్పెక్, ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్ వేద్దామా. 

Vivo V27 5G: ధర మరియు ఆఫర్లు

 వివో వి27 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB /128GB స్టోరేజ్ ధర రూ.32,999 మరియు 8GB /256GB స్టోరేజ్ ధర రూ.36,999. ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా వివో ప్రకటించింది. HDFC/ICICI/KOTAK బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.2,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్చేంజ్ పైన 2,500 రూపాయల బోనస్ వంటి ఆఫర్లను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను వివో అధికారిక వెబ్సైట్ మరియు Flipkart తో పాటుగా ఆఫ్ లైన్ స్టోర్స్ నుండి కూడా మీరు ఈరోజు బుక్ చేసుకోవచ్చు.   

ViVO V27 5G: స్పెసిఫికేషన్స్

ViVO V27 5G స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల FHD+ (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది  AMOLED ప్యానెల్‌ను ఉపయోగించింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కలర్ ఛేంజింగ్ గ్లాస్ ను అందించింది. వి 27 5జి ఫోన్ 8 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌జతగా మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 7200 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన FuntouchOS 13 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

వివో వి 27 5జి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP (OIS) Sony IMX766V ప్రాధమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. అయితే,ఈ ఫోన్ లో నైట్ పోర్ట్ రైట్ ఫోటోలను అందించడం కోసం Aura Lite ని అందించింది. ముందు వైపు, 50MP భారీ సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోనులో వివో అందించింది. ఈ ఫోన్ 66W ఫ్లాష్ ఛార్జ్  సపోర్ట్ కలిగిన 4,600mAh బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :