భారీ ఆఫర్లతో ViVO V25 Pro సేల్ అవుతోంది..!!

భారీ ఆఫర్లతో ViVO V25 Pro సేల్ అవుతోంది..!!
HIGHLIGHTS

వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ViVO V25 Pro

ViVO V25 Pro Flipkart నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ అఫర్ తో పొందేవీలుంది

వివో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ViVO V25 Pro స్మార్ట్ ఫోన్ Flipkart నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 64ఎంపి OIS సూపర్ నైట్ పోర్ట్రైట్ ట్రిపుల్ కెమెరాతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ అఫర్ తో పొందేవీలుంది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు గురించి తెలుసుకోండి.      

ViVO V25 Pro: ధర మరియు ఆఫర్లు

 వివో వి25 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.35,999. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ.39,999. ఈ ఫోన్ పైన కంపెనీ లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.3,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్చేంజ్ పైన 3,000 రూపాయల బోనస్ వంటి ఆఫర్లను అందించింది.                                      

ViVO V25 Pro: స్పెసిఫికేషన్స్

Vivo V20 Pro స్మార్ట్ ఫోన్ 6.56-అంగుళాల FHD+ (2376 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన 3D కర్వ్డ్ డిస్ప్లేని కలిగివుంది, అదీకూడా AMOLED ప్యానెల్‌ను ఉపయోగించింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో తయారు చేయబడింది, కాబట్టి ఇది రంగులు మారుస్తుంది. వి 25 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 1300 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది.

వివో వి 25 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OIS 64 ఎంపి ప్రాధమిక కెమెరా, 8 ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 32MP Eye AF సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. V25 ప్రో 66W ఫ్లాష్ ఛార్జ్ 4 సపోర్ట్ కలిగిన 4,830mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo