Vivo V15 Pro ఒక 32MP పాప్-అప్ కెమేరా మరియు రియర్ ట్రిపుల్ కెమేరాతో టీజ్ : ఫిబ్రవరి 20న లాంచ్ కానుంది

Updated on 08-Feb-2019
HIGHLIGHTS

ఇప్పుడు వివో V15 ప్రో ని దాని బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి, ఆమిర్ ఖాన్ ను కలిగివున్నా ఒక వీడియోతో, ప్రచారాన్ని ప్రారంభించింది.

Vivo NEX మరియు Vivo NEX డ్యూయల్  డిస్ప్లే వంటి గుర్తించదగిన స్మార్ట్ ఫోన్ల వరుస క్రమాన్ని తీసుకొచ్చిన తరువాత, స్మార్ట్ ఫోన్ల యొక్క డిజైన్ ఆవిష్కరణలో ప్రస్తుతం ముందంజలో ఉంది. ఒక  పాప్ అప్ సెల్ఫీ కెమెరాలని ప్రపంచానికి  పరిచయం చేసిన తరువాత, రెండు స్క్రీన్ ను అమలు చేయడం ద్వారా రెండో ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఇప్పుడు, వివో తన Vivo V15 Pro ని  ఒక పాప్-అప్ కెమెరా డిజైన్ తో మనముందుకు తీసుకురావడానికి  సిద్ధంగా ఉంది.

ముందుగా,  సోషల్ మీడియాలో  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజ్ అందించింది, కానీ ఇప్పుడు వివో V15 ప్రో ని దాని బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి, ఆమిర్ ఖాన్ ను కలిగివున్నా ఒక వీడియోతో,  ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరాలతో పాటుగా  32MP పాప్-అప్ ఫ్రంట్ కెమెరాతో, స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఒక కొత్త ఒరవడిని తెచ్చేలా కనిపిస్తోంది.

వివో కూడా వెనుక భగంలో కెమెరాల యొక్క ట్రెఫెక్టాను "AI- Powered" తో తీసుకొచ్చింది, మేనము ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు నుండి కొత్తగా ఏదైనా  కోరుకుతున్నామంటే, అది ఇదే కావచ్చు. ఇది  ముందు ఇచ్చిన 32MP కెమెరాకు వెతువంటి సెన్సార్ ఇచ్చారో, వివో ఇంకా స్పష్టం చేయనప్పటికీ, ఇది ఇటీవల ప్రకటించిన శామ్సంగ్ ISOCELL Bright GD1 సెన్సారుగా చాలా మంది ఊహిస్తున్నారు.

ఈ రోజుల్లో ప్రాముఖ్యతను పొందిన కొన్ని ప్రత్యేకతలైనటువంటి,  ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గ్రేడియంట్ కలర్ ప్యాట్రన్, గ్లాస్ చట్రం వంటి వాటితో పూర్తి నిండుగా వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్.  

వివో V15 ప్రో స్మార్ట్ ఫోన్ను ఫిబ్రవరి 20 న భారతదేశంలో ప్రారంభించటానికి నిర్ణయించారు మరియు ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో గత ఏడాది ప్రారంభించిన వివో V11 ప్రో స్థానాన్ని ఆక్రమించే అవకాశం కూడా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :