Vivo V15 Pro పాప్ – అప్ సెల్ఫీ కెమెరాతో ఫిబ్రవరి 20న ఇండియాలో విడుదలవనుంది
ఫిబ్రవరిలో జరిగే ఒక కార్యక్రమం కోసం తేదీని కేటాయించమని, ఈ కంపెనీ మీడియాకు ప్రజంటేషన్ అందజేసింది.
ఫిబ్రవరి 20 వ తేదీన ఇండియాలో V 15 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు వివో ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగే ఒక కార్యక్రమం కోసం తేదీని కేటాయించమని, ఈ కంపెనీ మీడియాకు ప్రజంటేషన్ అందజేసింది. ఈ సంస్కరణ ప్రారంభానికి సంబంధించి ఏ సమాచారం లేదు కానీ ఈ వివో 15 ప్రో గత సంవత్సరం ప్రారంభించిన వివో నెక్స్ లో చూపిన పాప్-అప్ సెల్ఫీ కెమెరా విధానం కలిగి ఉంటుంది ఖచ్చితంగా తెలుస్తోంది.
ఈ ప్రకటన నుండి గమనిస్తే, మేనకు పాప్ అప్ కెమెరా స్థానం మధ్య తేడా చూడగలరు. వివో Nex డిస్ప్లే యొక్క ఎడమ అంచు వైపు ఈ మెకానిజం ఉండగా, ఈ వివో V15 ప్రో యొక్క టీజరులో కుడి అంచు వైపుగా ఈ మెకానిజాన్నితరలించడానికి సంస్థ ఎంచుకున్నట్లు సూచిస్తుంది. స్పెక్స్ మరియు ఇతర ఫీచర్లు గురించి ఇతర సమాచారం లేదు, మరియు ఇది వివో నెక్స్ వంటి ఎడ్జ్ -టూ-ఎడ్జ్ రూపకల్పనను కలిగి ఉంటుంది.
ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వివో V15 ఒక 32MP సెల్ఫీ కెమెరా కలిగివుంది. గతంలో, ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఒక ట్రాన్స్పరెంట్ కేసు ఈ డివైజ్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగివున్నట్లు ఆన్లైన్లో వెల్లడైంది. ఈ పుకార్లు ప్రకారం, ఈ ఫోన్ Vivo V11 ప్రో యొక్క వారసుడిగా చెప్పబడింది.
V15 ప్రో లో కూడా V11 ప్రో లో ఉన్నాఇన్ బిల్ట్ వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంటుంది. ఈ వాదనకు సూచనలు పైన పేర్కొన్న ట్రాన్స్పరెంట్ కేసు నుండి వచ్చాయి. ఎందుకంటే, ఇది వేలిముద్ర సెన్సార్ కట్ అవుట్ను చూపించదు. V11 ప్రో ధర రూ .25,990 మరియు వివో నెక్స్ ధర రూ. 39,990. ఈ Vivo V15 ప్రో ధర ఈ ఫోన్ల ధర మధ్య వుండే అవకాశం ఉంటుంది.
ఇటీవల, వివో Vivo Nex డ్యూయల్ డిస్ప్లే ఫోన్ (ఇండియాలో అందుబాటులో లేదు) ప్రకటించింది. ఇది ఒక 6.39-అంగుళాల FHD + సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది, ఇది ముందు 91.63 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఉంటుంది. అలాగే, వెనుక ఒక గాజు ప్యానెల్ కింద ఒక 5.49 అంగుళాల పూర్తి HD AMOLED డిస్ప్లేతో ఉంటుంది. ఈ పరికరం స్నాప్ డ్రాగన్ 845 SoC తో 10GB RAM మరియు 128GB స్టోరేజితో వస్తుంది. ఫోటోగ్రఫీ వివరాల గురించి చూస్తే, 12MP F / 1.79 ఎపర్చర్ మరియు 4-యాక్సిస్ OIS తో 12MP సోనీ IMX 363 సెన్సార్ తో ఉంటాయి. ఇది వెనుక f / 1.3 ఎపర్చరుతో ఒక 3D TOF సెన్సారుతో పాటు 2MP నైట్ వ్యూ కెమెరాతో ఉంటుంది.
వివో భారతదేశంలో కూడా మంచి స్థానంలోనే వుంది, అంతకుముందు సంవత్సరంలో మొదటి ఐదు స్మార్ట్ ఫోన్ విక్రయేతలలో స్థానం సంపాదించింది. హాంకాంగ్ మార్కెట్ ఆధారిత పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా డేటా ప్రకారం, 2018 మొత్తంలో భారతీయ స్మార్ట్ ఫోన్ షిప్మెంటులో 10 శాతం వాటాతో వివో మూడవ స్థానంలో నిలిచింది. 2018 నాలుగో త్రైమాసికంలో 9 శాతం మార్కెట్ ఎగుమతుల వాటాతో వివో మూడవ స్థానంలో నిలిచింది.