వివో అప్ కమింగ్ ఫోన్ వివరాలు అనౌన్స్ మెంట్ కంటే ముందే లీక్..!!

వివో అప్ కమింగ్ ఫోన్ వివరాలు అనౌన్స్ మెంట్ కంటే ముందే లీక్..!!
HIGHLIGHTS

VIVO అప్ కమింగ్ ఫోన్ యొక్క వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి

Vivo Y35 4G యొక్క కీలకమైన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అతి త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు

ఇండియాలో వివో కొత్త ఫోన్ విడుదల చెయ్యడానికి సిద్ధమవుతుండగా, ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అదే, Vivo Y35 4G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాస్తవానికి, వివో అప్ కమింగ్ ఫోన్ వివో వై35 4G  యొక్క అధికారిక లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, మాహేష్ టెలికాం లీక్ చేసిన అధికారిక పోస్టర్ ను మాత్రం ఆన్లైన్లో లీక్ చేసింది. కాబట్టి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అతి త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన వివరాలు ఏమిటో తెలుసుకుందామా.    

మాహేష్ టెలికాం లీక్ చేసిన ఈ పోస్టర్ ద్వారా, వివో వై35 4G స్మార్ట్ ఫోన్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP కెమెరా మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని నిర్ధారనయ్యింది. ఈ ఫోన్ ను 15,000 రూపాయల బడ్జెట్ లో ఇండియాలో ప్రకటించవచ్చని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.

Vivo Y35 4G: స్పెక్స్

ఇక వివో వై35 4G స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్‌ పెద్ద 6.58-అంగుళాల డిస్ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌ తో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 SoC కి జతగా 8GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ (1TB వరకు బాహ్య మెమరీ) కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ బోకె సెన్సార్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారితమైన Funtouch 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo