Vivo T4 5G దేశంలో పెద్ద బ్యాటరీ కలిగిన 5G ఫోన్ గా రాబోతుంది.!

Vivo T4 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజింగ్ పోస్ట్ ద్వారా ఈ ఫోన్ ను దేశంలో పెద్ద బ్యాటరీ కలిగిన 5G ఫోన్ గా తీసుకురాబోతున్నట్లు వివో టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బ్యాటరీ విషయంలో మాత్రమే కాదు చాలా వివరాలు కలిగి ఉంటుందని కూడా వివో గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ వివరాలు ఏమిటో చూద్దామా.
Vivo T4 5G : లాంచ్
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి4 5జి లాంచ్ డేట్ వివో ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని మాత్రం టీజింగ్ చేస్తోంది. వివో ఈ సిరీస్ నుంచి టి14x ఫోన్ ను విడుదల చేసిన వివో, ఇప్పుడు వివో టి 14 5జి స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
Also Read: సూపర్ డీల్: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
Vivo T4 5G : ఫీచర్స్
వివో టి 4 5జి స్మార్ట్ ఫోన్ భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా లాంచ్ అవుతుందని వివో టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగి ఉండనున్న బ్యాటరీ ఎంత శక్తితో ఉంటుందో తెలిపే టీజింగ్ ఇమేజ్ ను కూడా అందించింది. ఇందులో 5000 mAh కంటే చాలా అధికంగా ఉండే ఒక పిల్లర్ ను చూపిస్తోంది. వాస్తవానికి, ప్రస్తుతానికి 700 mAh బ్యాటరీతో కూడా స్మార్ట్ ఫోన్ లు లభిస్తున్నాయి. కాబట్టి ఈ అప్ కమింగ్ వివో ఫోన్ అంతకంటే పెద్ద బ్యాటరీ కలిగి ఉంటేనే ఇండీఐలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా అవతరించే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజిలో అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని కూడా వివో టీజింగ్ చేస్తోంది. ప్రస్తూయానికి వివో ఈ ఫోన్ యొక్క ఈ వివరాలు మాత్రమే వెల్లడించింది. అయితే, త్వరలోనే ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన వివరాలు మరియు లాంచ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.