Vivo T3X 5G: 44W ఫాస్ట్ ఛార్జ్ 6000mAh బ్యాటరీతో లాంఛ్ అవుతోంది.!

Vivo T3X 5G: 44W ఫాస్ట్ ఛార్జ్ 6000mAh బ్యాటరీతో లాంఛ్ అవుతోంది.!
HIGHLIGHTS

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను వివో కన్ఫర్మ్ చేసింది

Vivo T3X 5G అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర బయట పెట్టిన వివో

ఇప్పటికే ఈ ఫోన్ కోసం టీజింగ్ కూడా మొదలు పెట్టింది

Vivo T3X 5G: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను వివో కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన వివో, ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్లతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర మరియు ప్రత్యేకమైన ఫీచర్ల గురించి కూడా టీజింగ్ ద్వారా బయట పెట్టింది. మరి ఈ వివో అప్ కమింగ్ ఫోన్ కొత్త సంగతులు ఏంటో చూద్దామా.

Vivo T3X 5G ఎప్పుడు లాంఛ్ అవుతుంది?

వివో ఈ Vivo T3X 5G స్మార్ట్ ఫోన్ ను 2024 ఏప్రిల్ 17 వ తేదీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్ సేల్ పార్ట్నర్ గా Flipkart వ్యవహరిస్తోంది మరియు ఇప్పటికే ఈ ఫోన్ కోసం టీజింగ్ కూడా మొదలు పెట్టింది. దీనికోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించి, ఈ పేజ్ నుండి ఈ ఫోన్ వివరాలతో టీజింగ్ చేస్తోంది.

Vivo T3X 5G అంచనా ధర ఎంత?

వివో టి3x 5జి స్మార్ట్ ఫోన్ ను అండర్ 15k ఫోన్ గా వివో చెబుతోంది. అంటే ఈ ఫోన్ ను 15 వేల రూపాయల కంటే తక్కువ ధరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, 15 వేల కంటే తక్కువ ధరలో Turbo 5G ఫోన్ ను గా ఇది వస్తోందని కూడా చెబుతోంది.

Also Read: Smartphone Camera Tips: బడ్జెట్ ఫోన్ తో కూడా సూపర్ ఫోటోల అందించే బెస్ట్ టిప్స్.!

వివో టి3x 5జి లో ఏమి ప్రత్యేకతలు ఉన్నాయి?

వివో టి3x 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన మరియు ప్రధానమైన ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను సన్నగా ఉండే ఐ క్యాచింగ్ డిజైన్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను Snapdragon 6 Gen 1 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తున్నట్లు తెలిపింది మరియు ఈ ఫోన్ AnTuTu స్కోర్ ను కూడా టీజర్ లో అందించింది.

Vivo T3X 5G Processor
Vivo T3X 5G Processor

వివో టి3x 5జి ఫోన్ గరిష్టంగా 560K AnTuTu స్కోర్ ను అందిస్తుందని చెబుతోంది. అంటే, ఈ ఫోన్ ఎంత వేగంగా పని చేస్తోందని ఒకఅంచనా ఇస్తోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద రింగ్ బంప్ కెమేరా డిజైన్ ను చూడవచ్చు. అయితే, ఈ ఫోన్ లో అందించిన కెమేరా వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెళ్ళడించ లేదు. కానీ ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా ఉన్నట్లు మనం చూడవచ్చు.

Vivo T3X 5G Battery
Vivo T3X 5G Battery

ఈ ఫోన్ ను 120 Hz FHD+ డిస్ప్లేని 1000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ 6000mAh బ్యాటరీ ఉంటుందని కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, గొప్ప సౌండ్ అందించే Dual Stereo Speaker లను కూడా ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నట్లు వివో గొప్పగా చెబుతోంది.

ఈ ఫోన్ గురించి ప్రస్తుతానికి వివో ఈ స్పెక్స్ ను మాత్రమే బయటపెట్టింది. అయితే, లాంఛ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను వెల్లడిస్తుందని చెబుతొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo