vivo T3 Ultra ఫోన్ 30 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
vivo T3 Ultra స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది
ఈ ఫోన్ ను 30 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో లాంచ్ చేసిందని తడుముకోకుండా చెప్పవచ్చు
ఈరోజు మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా
vivo T3 Ultra స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను 30 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో లాంచ్ చేసిందని తడుముకోకుండా చెప్పవచ్చు. ఎందుకంటే, 1.6M AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ ప్రోసెసర్, సోనీ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ కెమెరా మరియు సూపర్ విజువల్స్ అందించే స్క్రీన్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. సరికొత్తగా ఈరోజు మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
vivo T3 Ultra: ప్రైస్
వివో టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఇప్పుడు చూద్దాం.
వివో టి3 అల్ట్రా (8GB + 128GB) వేరియంట్ ధర : రూ. 31,999
వివో టి3 అల్ట్రా (8GB + 256GB) వేరియంట్ ధర : రూ. 34,999
వివో టి3 అల్ట్రా (12GB + 256GB) వేరియంట్ ధర : రూ. 35,999
ప్రైస్ లిస్ట్ తో ఈ ఫోన్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. Flipkart, వివో అధికారిక వెబ్సైట్ shop.vivo.com మరియు రిటైల్ స్టోర్స్ నుంచి ఈ ఫోన్ లభిస్తుంది.
ఆఫర్స్
వివో టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ పై గొప్ప ఆఫర్లు కూడా వివో అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 3,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది లేదా ఎక్స్ చేంజ్ తో ఈ ఫోన్ ను కొనే వారికి రూ. 3,000 ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై 6 నెలల No Cost EMI ఆఫర్ కూడా అందించింది.
Also Read: Lava Blaze 3 5G: భారీ ఫీచర్స్ తో 10 వేల బడ్జెట్ లో లాంచ్ అవుతోంది.!
vivo T3 Ultra: ఫీచర్స్
వివో టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను 1.5K సూపర్ రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 6.78 బిగ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ Dimensity 9200+ చిప్ సెట్ మరియు జతగా 12GB ర్యామ్ తో ఈ ఫోన్ ను తెచ్చింది. అలాగే, ఫోటోలు మరియు మీడియా స్టోరేజ్ కోసం 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ను అందించింది.
ఈ వివో కొత్త ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో, 50MP Sony IMX921 (OIS) + 8MP అల్ట్రా వైడ్ కెమెరా ని కలిగి వుంది. ఈ ఫోన్ లో 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరాతో 60fps వద్ద 4K Video లను షూట్ చేసే వీలుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh హెవీ బ్యాటరీ కూడా వుంది.