Vivo T3 Ultra 5G: వివో T3 సిరీస్ లో ఇప్పటి వరకు చూడని పవర్ ఫుల్ ఫోన్ ను వివో లాంచ్ చేస్తోంది. అదే, వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ ను వివో వెల్లడించింది. రేపు లాంచ్ అవుతున్న ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్లు ముందుగానే తెలుసుకుందామా.
ముందుగా ఈ ఫోన్ లాంచ్ విషయానికి వస్తే, వివో టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ 55 ఫీచర్ ఇప్పుడు చూద్దాం.
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ ను కలిగి 4500 నిట్స్ లోకల్ బ్రైట్నెస్ సపోర్ట్ తో ఉంటుంది.
వివో ఈ ఫోన్ చాలా వేగవంతమైన మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే మీడియాటెక్ Dimensity 9200+ 5G చిప్ సెట్. ఇది 1.6M AnTuTu స్కోర్ ను నమోదు చేస్తుంది మరియు చాలా వేగంగా ఉంటుంది.
వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ లో 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ఉంటుందంట. అంటే, ఈ ఫోన్ 24GB ర్యామ్ సపోర్ట్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే అవకాశం ఉంటుంది.
Also Read: ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ HUAWEI Mate XT ను విడుదల చేసిన హువావే.!
వివో టి3 అల్ట్రా ఫోన్ లో సూపర్ డ్యూయల్ రియర్ మరియు గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో వెనుక OIS సపోర్ట్ గల 50MP (Sony IMX921) మెయిన్ కెమెరా + 8MP వైడ్ యాంగిల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరాతో 60fps వద్ద స్టేబుల్ 4K వీడియోలు షూట్ చేయవచ్చు.
టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది.