Vivo T3 Ultra 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ప్రకటించిన వివో.!
Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను వివో ఈరోజు ప్రకటించింది
ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది
ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ చేస్తోంది
Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను వివో ఈరోజు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డాట్ తో పాటుగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది. ఇటీవల టి సిరీస్ నుంచి వివో టి3 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన వివో ఇప్పుడు టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను వివో వి 40 సిరీస్ మాదిరి కెమెరా డిజైన్ తో అందిస్తున్నట్టు టీజర్ ఇమేజ్ ల ద్వారా అర్థం అవుతోంది.
Vivo T3 Ultra 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వివో టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ అందిస్తున్నట్టు ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ చేస్తోంది.
Vivo T3 Ultra 5G ఫీచర్లు ఎలా ఉన్నాయి?
వివో టి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9200+ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ చిప్ సెట్ గరిష్టంగా 1.6 M AnTuTu స్కోర్ తో సూపర్ స్పీడ్ గా ఉంటుందని వివో వెల్లడించింది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 మరియు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 కంటే కూడా అధిక స్కోర్ ను కలిగి ఉంటుందని వివో తెలిపింది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా 12GB ఫిజికల్ ర్యామ్ + 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో మరింత వేగంగా ఉంటుందని కూడా వివో తెలిపింది.
ఈ ఫోన్ లో అందించిన స్క్రీన్ వివరాలు కూడా ముందే తెలిపింది. టి 3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOELD స్క్రీన్ ను కలిగి ఉంటుందిట. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు 4500 నిట్స్ లోకల్ బ్రైట్నెస్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
Also Read: BSNL PLAN: బడ్జెట్ ధరలో డైలీ అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ లో కూడా ఈ ఫోన్ ప్రీమియం గా ఉంటుంది. ఎందుకంటే,ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh పవర్ ఫుల్ బ్యాటరీ తో వస్తుంది కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తుందని వివో తెలిపింది. అయితే, ఈ ఫోన్ లో Sony పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఉంటుందని వివో హింట్ ఇచ్చింది.