Vivo T3 Ultra 5G లాంచ్ అనౌన్స్ చేసిన వివో.. ఫోన్ ఎలా ఉందంటే.!

Updated on 05-Sep-2024
HIGHLIGHTS

Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్ అనౌన్స్ అయ్యింది

వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబొతున్నల్టు వివో ప్రకటించింది

ఈ ఫోన్ డిజైన్ తో కూడిన ఇమేజ్ తో ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది

Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని నిన్న మొన్నటి వరకు నెట్టింట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, వీటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ వివో ఈ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ తో కూడిన ఇమేజ్ తో ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది.

Vivo T3 Ultra 5G లాంచ్

వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబొతున్నల్టు వివో ప్రకటించింది. ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజ్ ను కూడా అందించింది.

Vivo T3 Ultra 5G టీజర్ ఇమేజ్ ఏమి చెబుతోంది?

వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Aura లైట్ ఫ్లాష్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ డిజైన్ కెమెరా మరియు కొత్త ప్రీమియం కెమెరా మోడ్యూల్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా వివో అందించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుందట. ఈ ఫోన్ కేవలం 7.5mm మందంతో చాలా సన్నగా ఉంటుందని కూడా వివో తెలిపింది. టి 3 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ మరియు 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో రాబోతున్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది మరియు ఈ ఫోన్ లో Sony ఫ్లాగ్ షిప్ కెమెరా ఉన్నట్లు కూడా వివో కన్ఫర్మ్ చేసింది.

Also Read: Jio 8th Anniversary Offer: జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.!

ఇక ఈ ఫోన్ లో అందించే ప్రోసెసర్ వివరాలు వివో రేపు విడుదల చేస్తుందట. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర వివరాలు కూడా అతి త్వరలో వెల్లడిస్తుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :