Vivo T3 Pro స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ ను కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఈ ఫోన్ ను 50MP Sony IMX 882 కెమెరా మరియు కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది.
వివో టి 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను గొప్ప కర్వుడ్ డిజైన్ కర్వుడ్ స్క్రీన్ తో తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ లో 120 రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే Curved AMOLED స్క్రీన్ వుంది. ఈ ఫోన్ కేవలం 7.49mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు ఇది 820K+ AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా వివో తెలిపింది.
ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా సెటప్ ను కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరొక సెన్సార్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ సాండ్ స్టోన్ ఆరెంజ్ అనే కలర్ తో అందంగా కనిపిస్తుంది మరియు ఇది లెదర్ బ్యాక్ ప్యానల్ తో ఉంటుంది.
Also Read: Poco Pad 5G: డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ తో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ వివరాలను ఆగస్టు 26వ తేదీ వివో వెల్లడిస్తుంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ అందమైన లుక్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో పాటు సరికొత్త కలర్ లో ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ ధరను బట్టి ఈ ఫోన్ ఏ బడ్జెట్ సెగ్మెంట్ ను టార్గెట్ చేస్తుందో అర్థం అవుతుంది.