Vivo T3 Lite స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ లో Sony AI కెమెరాతో వచ్చింది.!

Vivo T3 Lite స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ లో Sony AI కెమెరాతో వచ్చింది.!
HIGHLIGHTS

Vivo T3 Lite ను బడ్జెట్ ధరలో మార్కెట్ లో విడుదల చేసింది

ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో Sony AI కెమెరాతో విడుదల చేసింది

ఈ ఫోన్ ను కేవలం రూ. 10,499 ధరతో లాంచ్ చేసింది

ముందుగా చెప్పినట్టుగానే Vivo T3 Lite స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలచేసింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో Sony AI కెమెరాతో విడుదల చేసింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్, బడ్జెట్ పవర్ ఫుల్ ప్రోసెసర్ మరియు స్టన్నింగ్ కలర్ ఆప్షన్ లలో వచ్చింది. వివో సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఫీచర్లు మరియు ప్రైస్ ఎలా ఉందో తెలుసుకోండి.

Vivo T3 Lite : ప్రైస్

వివో టి3 లైట్ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 10,499 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క రెండవ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 11,499 ధరతో విడుదల చేసింది. వివో టి3 లైట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ వివో అధికారిక వెబ్సైట్, Flipkart మరియు అన్ని రిటైల్ స్టోర్ ల నుండి లభిస్తుంది.

Also Read: Realme C61 ఫోన్ లాంచ్ కంటే ముందే ధర ప్రకటించిన రియల్ మీ.!

Vivo T3 Lite : ఫీచర్లు

వివో టి3 లైట్ స్మార్ట్ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD రిజల్యూషన్ కలిగిన 6.56 ఇంచ్ LCD డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఈ ఫోన్ ను Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో కలిపి మొత్తం 12GB ర్యామ్ సపోర్ట్ ను అందించింది. దీనితో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ మరియు ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ తో స్టోరేజ్ ను 1TB వరకు పెంచుకునే అవకాశం వుంది.

Vivo T3 Lite  ఫీచర్లు
Vivo T3 Lite ఫీచర్లు

ఈ ఫోన్ లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony AI సెన్సార్ ప్రధాన కెమెరా వుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీ మరియు స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 2.0 సపోర్ట్ కలిగిన టైప్ సి పోర్ట్ వుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ మెజిస్టిక్ బ్లాక్ మరియు వైబ్రాంట్ గ్రీన్ రెండు కలర్ లలో లభిస్తుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo