digit zero1 awards

వివో యొక్క అత్యంత సరసమైన 5G ఫోన్ గా వస్తున్న Vivo T3 Lite

వివో యొక్క అత్యంత సరసమైన 5G ఫోన్ గా వస్తున్న Vivo T3 Lite
HIGHLIGHTS

వివో ఇండియాలో కొత్త Vivo T3 Lite 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది

ఈ ఫోన్ వివో బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన 5జి స్మార్ట్ ఫోన్ గా వస్తోంది

ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ను అందించింది

వివో ఇండియాలో కొత్త Vivo T3 Lite 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం చేపట్టిన టీజర్ క్యాంపైన్ నుండి ఈ ఫోన్ గురించి కొత్త వివరాలు బయట పెట్టింది. ఈ ఫోన్ వివో బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన 5జి స్మార్ట్ ఫోన్ గా ఉండబోతుందని టీజర్ పేజీ నుండి తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది.

Vivo T3 Lite

ఈ స్మార్ట్ ఫోన్ ను జూన్ 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. ఈ ఫోన్ ను Flipkart ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ను అందించింది. ఈ ఫోన్ టీజర్ పేజీ నుండి ఈ ఫోన్ వివో యొక్క అత్యంత సరసమైన ఫోన్ గా వస్తోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ లను కూడా రివీల్ చేస్తోంది.

Vivo T3 Lite: ఫీచర్లు

ముందుగా మేము తెలిపిన విధంగా, ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోసెసర్ AnTuTu స్కోర్ ను కూడా ఈ ఫోన్ టీజర్ పేజీ నుండి రివీల్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది మరియు స్లీక్ డిజైన్ తో రెండు కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ 5జి సపోర్ట్ తో ఉంటుంది మరియు అంతరాయం లేని గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని కూడా వివో తెలిపింది.

Vivo T3 Lite Processor
Vivo T3 Lite Processor

ఈ ఫోన్ లో Sony AI కెమెరా ఉన్నట్లు వివో ఆటపట్టిస్తోంది. ఈ కెమెరా వివరాలను జూన్ 25న విడుదల చేస్తుందని కూడా తెలిపింది. ఈ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా విడుదలైన వివో టి3 5జి ఫోన్ యొక్క డౌన్ టోన్ వెర్షన్ గా వస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఎక్కువ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంటుందని ఊహిస్తున్నారు.

Also Read: Samsung సూపర్ కెమెరా ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రూ. 12,999 ధరకే లభిస్తోంది.!

ఈ వివో అప్ కమింగ్ 5జి స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు గ్రీన్ రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుంది. ఈ ఫోన్ లో పైన పెద్ద స్పీకర్ గ్రిల్ మరియు కెమెరా సెటప్ తో సింగల్ LED ఫ్లాష్ లైట్ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo