Vivo T3 5G: ఇండియాలో రీసెంట్ గా Vivo V30 మరియు V30 Pro లను విడుదల చేసిన వివో, మరొక కొత్త ఫోన్ ను లాంఛ్ చేయబోతోంది. వివో ఇండియాలో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి30 5జి గురించి కొత్త విషయాలను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ మరియు కెమెరా సెటప్ లను మాత్రమే టీజర్ ఇమేజ్ ద్వారా ముందుగా అందించింది. అయితే, ఇప్పుడు ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రాసెసర్ మరియు కెమెరా వివరాలను కూడా కంపెనీ బయటపెట్టింది.
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ T3 5జి, మార్చి 21 వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే, ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్ ని కూడా మొదలుపెట్టింది.
Also Read: Jio 6G: ఫ్యూచర్ నెట్ వర్క్ కోసం సొంత 6G Core సిద్ధం చేస్తున్న జియో.!
వివో అప్ కమింగ్ ఫోన్ వివో టి30 5జి మంచి డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా తక్కువ మందంతో స్లీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు మనం చర్చించుకున్నది కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా మనం చూసిన వివరాలు మాత్రమే సుమీ. అయితే, కంపెనీ ఈ ఫోన్ గురించి రెండు కొత్త వివరాలను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7200 ఆక్టా కోర్ 5జి ప్రాసెసర్ తో తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది.
అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా గురించి కూడా హింట్ ఇచ్చింది. ఈ వివో అప్కమింగ్ ఫోన్ లో వెనుక ఉన్న రియర్ కెమెరాలో OIS సపోర్ట్ కలిగిన Sony మెయిన్ కెమెరా ఉన్నట్లు తెలిపింది. ఈ కెమెరా సెటప్ గురించి పూర్తి వివరాలను మార్చి 18వ తేదీ వెల్లడిస్తుందని కూడా టీజింగ్ చేస్తుంది.
అయితే, వాస్తవానికి ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలతో ముందే లీక్ రిపోర్ట్ ఆన్లైన్ లో వెళ్లడయ్యింది. ఈ నివేదికలో తెలిపిన విధంగానే ఈ ఫోన్ అదే ప్రాసెసర్ మరియు కెమెరాను కలిగి ఉన్నట్లు ఇప్పుడు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.