Vivo T3 5G: విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన పూర్తి వివరాలు.!

Updated on 11-Mar-2024
HIGHLIGHTS

వివో టి3 5జి గురించి కంపెనీ లాంఛ్ టీజర్ ను విడుదల చేసింది

Vivo T3 5G పూర్తి వివరాలు నెట్టింట్లో లీక్ అయ్యాయి

ఈ ఫోన్ యొక్క అని వివరాలు ఆన్లైన్ లో దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది

Vivo T3 5G: వివో అప్ కమింగ్ ఫోన్ వివో టి3 5జి గురించి కంపెనీ లాంఛ్ టీజర్ ను విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ లాంఛ్ టీజర్ వచ్చిన వెంటనే ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలను appuals.com నెట్టింట్లో లీక్ చేసింది. ఈ వివో అప్ కమింగ్ ఫోన్ లాంఛ్ డేట్ కూడా ప్రకటించక ముందే ఈ ఫోన్ యొక్క అని వివరాలు ఆన్లైన్ లో దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ తో పాటుగా పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ ను అప్పువల్స్ అందించింది. మరి నెట్టింట్లో విడుదలైన వివరాలు మరియు సంగతులు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Vivo T3 5G: Leaks

వివో టి3 5జి ఫోన్ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలను మరియు ఇమేజ్ లను కూడా ఎక్స్ క్లూజివ్ సోర్స్ ద్వారా అందుకున్నట్లు ఈ నివేదికలో తెలిపింది. ఈ రిపోర్ట్ ద్వారా, వివో టి3 5జి స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్లు కూడా తెలియ వచ్చాయి.

Vivo T3 5G: Leaked Specs

రిపోర్ట్ ప్రకారం, వివో టి3 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7200 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 8GB RAM, ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ మరియు 128 GB / 256 GB స్టోరేజ్ ఆప్షన్ లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే బ్రాండెడ్ 1.5 Ton Split AC లను ఆఫర్ చేస్తున్న Flipkart.!

ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ ట్రిపుల్ కెమేరాని కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ కెమేరా సెటప్ లో 50MP SonyIMX882 మెయిన్ కెమేరా ఉంటుందని కూడా తెలిపింది. ఈ మెయిన్ కెమేరా OIS సపోర్ట్ తో ఉంటుందని మరియు 4K Video రికార్డ్ సపోర్ట్ తో ఉంటుందని కూడా తెలిపింది. అంతేకాదు, ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమేరా కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది.

మరిన్ని ఇతర వివరాలను కూడా ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ వివో ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని మరియు IP54 రేటింగ్ తో డస్ట్ & వాటర్ రెస్టింట్ తో ఉంటుందని కూడా తెలిపింది.

Vivo T3 5G Launch

అయితే, ఫోన్ యొక్క లాంఛ్ డేట్ అనౌన్స్ తో పాటుగా ఈ ఫోన్ యొక్క అధికార స్పెక్స్ వివరాలను కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :