వివో ఈరోజు ఇండియన్ మార్కెట్ లో Vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. వివో యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరు పొందిన Vivo T Series నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను 64MP OIS కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో చవక ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఓవరాల్ ఫీచర్స్ తో తీసుకుచిన వివో ప్రైస్ ను మాత్రం భారత యూజర్లను దృష్టిలో ఉంచుకొని అనౌన్స్ చేసినట్లు కనిపిస్తోంది. Vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు వివరంగా తెలుసుకుందాం పదండి.
వివో ఈరోజే విడుదల చేసిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999 గా ప్రకటించింది మరియు ఈ ఫోన్ 8GB RAM మరియు 128 GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ వివో ఫోన్ యొక్క 8 GB RAM మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999
Vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ కంపెనీ బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లను అందించింది. ఈ Vivo T2 Pro 5G ఫోన్ ను ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తక్షణమే లభిస్తుంది. అంటే, ఈ అఫర్ ద్వారా ఈ ఫోన్ రూ. 21,999 రూపాయల ప్రారంభ ధరకే కొనుగోలు చేసే అవకాశం కంపెనీ అందించింది.
https://twitter.com/Vivo_India/status/1705109619037573415?ref_src=twsrc%5Etfw
ఈ వివో లేటెస్ట్ 3D Curved Display ఫోన్ సెప్టెంబర్ 28వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను vivo.com మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది.
Vivo T2 Pro 5G ను వివో పెద్ద 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేని In-display ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించింది. ఈ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు cinema-grade DCI-P3 సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందించేలా రూపొందించినట్లు వివో తెలిపింది.
ఈ ఫోన్ ను ఈ ధర సెగ్మెంట్ లో భారీ పోటీగా నిలిపేందుకు వీలుగా MediaTek Dimensity 7200 ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో లాంచ్ చేసింది వివో. దీనికి జతగా 8 GB RAM + 8 GB ఎక్స్ టెండెడ్ RAM మరియు 256 GB వరకూ స్టోరేజ్ జతగా ఉన్నాయి.
Vivo T2 Pro 5G ఫోన్ కెమేరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 64MP OIS మెయిన్ కెమేరా మరియు 2MP Bokeh కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరా Night, Portrait, Photo, Video మరియు Dual View వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమేరాని కూడా వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Funtouch OS 13 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో నడుస్తుంది.
Vivo T2 Pro 5G ఛార్జింగ్ మరియు బ్యాటరీ పరంగా, 4600 mAh బ్యాటరీని 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.