వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరుపొందిన Vivo T series నుండి కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, Vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన స్పెషిఫికేషన్ లను వివో టీజింగ్ పేజ్ ద్వారా వెల్లడించింది. Vivo T2 Pro 5G ను లాంచ్ గురించి Flipkart ఇప్పటికే మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈపేజ్ ద్వారా Vivo T2 Pro 5G గురించి కంపెనీ అందించిన ఆ కీలకమైన వివరాలు ఏమిటో చూద్దామా.
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T2 Pro 5G ని సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తోంది.
vivo t2 pro 5g స్మార్ట్ ఫోన్ కోసం flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ నుండి ఈ వివో అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను వెల్లడించింది.
వివో టీజింగ్ ఇమేజ్ మరియు స్పెక్స్ ద్వారా ఈ వివో టి2 ప్రో 5జి ఫోన్ ఎలా ఉండబోతుంది అనే విషయం అర్ధమవుతోంది. వివో టీజింగ్ ప్రకారం, ఈ ఫోన్ Curved Display మరియు సన్నని డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ టీజింగ్ ఇమేజ్ లో ఈ ఫోన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది మరియు ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో నడుస్తున్న Curved Display ని కంపెనీ మరిన్ని ఫోన్లలో కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
https://twitter.com/Vivo_India/status/1702557577375350841?ref_src=twsrc%5Etfw
Vivo T2 Pro 5G లో ఉన్న ప్రోసెసర్ ను వివో బయటపెట్టింది. ఈ ఫోన్ ను MediaTek Dimensity 7200 ఫాస్ట్ 5G ప్రాసెసర్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది మరియు ఈ ప్రోసెసర్ 7,20,000 Antutu స్కోర్ తో వస్తుందని మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇదే బెస్ట్ ప్రొసెసర్ ఫోన్ అవుందని కూడా నొక్కి చెబుతోంది.
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా వెనుక Aura lite తో డ్యూయల్ కెమేరా ఉన్నట్లు చూడవచ్చు. అయితే, కెమేరా వివరాలను వివో ఇంకా వెల్లడించ లేదు. కానీ, ఫోన్ పైన ధించిన లోగో ద్వారా ఇది కూడా OIS సపోర్ కలిగిన Professional Portrait camera తో వస్తుంది.
Vivo T2 Pro 5G launch కోసం ఇంకా చాలా సమయం వుంది కాబట్టి లాంచ్ కంటే ముందే మరిన్ని వివరాలను వివో వెల్లడించే అవకాశం వుంది.