వివో యొక్క లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ vivo T2 5G మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కెమెరా సెంట్రిక్ మరియు ప్రీమియం లుక్ తో కూడిన డిజైన్ వంటి మరిన్ని ఇతర ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 18 వ తేదీ మద్యహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ లేటెస్ట్ ఫోన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు.
vivo T2 5G స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ 6GB మరియు 128GB స్టోరేజ్ తో రూ.18,990 ధరతో లాంచ్ అయ్యింది. రెండవ వేరియంట్ 8GB మరియు 128GB స్టోరేజ్ రూ.20,990 ప్రైస్ ట్యాగ్ తో వచ్చింది. మొదటి సేల్ నుండి ఈ ఫోన్ ను ICICI,SBI మరియు HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% భారీ తగ్గింపు లభిస్తుంది. Flipkart మరియు వివో ఆన్లైన్ స్టోర్స్ నుండి ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జరుగుతుంది.
Vivo T2 5G స్మార్ట్ ఫోన్ FHD+ రిజల్యూషన్ కలిగిన 6.38 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పాటుగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా ఉన్నాయి.
ఈ వివో T2 5జి ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కలిగిన 64MP మైన్ కెమెరా మరియు 2MP కెమెరాలతో డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన Funtouch OS 13 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది.