Vivo Y300 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు సరికొత్త కలర్స్ మరియు ఐ క్యాచ్ డిజైన్ తో పాటు లేటెస్ట్ చిప్ సెట్ తో వివో లాంచ్ చేసింది.
వివో వై300 5జి స్మార్ట్ ఫైన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. వివో వై 300 బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 21,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 23,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పల్ మరియు టైటానియం సిల్వర్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది.
ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ ను ఈరోజు నుంచే మొదలు పెట్టింది. ఈ వివో కొత్త ఫోన్ మొదటి సేల్ నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ పై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 11 వేలకే బ్రాండ్ న్యూ 600W Dolby Soundbar అందుకోండి.!
వివో ఈ కొత్త ఫోన్ ను Snapdragon 4 Gne 2 చిప్ సెట్ తో అందించింది దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.
ఈ వివో ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. వై300 5జి ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.