Vivo Y300 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా విడుదల చేసిన వివో.!
Vivo Y300 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేసింది
సరికొత్త కలర్స్ మరియు ఐ క్యాచ్ డిజైన్ తో పాటు లేటెస్ట్ చిప్ సెట్ తో వివో లాంచ్ చేసింది
Vivo Y300 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు సరికొత్త కలర్స్ మరియు ఐ క్యాచ్ డిజైన్ తో పాటు లేటెస్ట్ చిప్ సెట్ తో వివో లాంచ్ చేసింది.
Vivo Y300 5G : ప్రైస్
వివో వై300 5జి స్మార్ట్ ఫైన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. వివో వై 300 బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 21,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 23,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పల్ మరియు టైటానియం సిల్వర్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది.
ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ ను ఈరోజు నుంచే మొదలు పెట్టింది. ఈ వివో కొత్త ఫోన్ మొదటి సేల్ నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ పై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 11 వేలకే బ్రాండ్ న్యూ 600W Dolby Soundbar అందుకోండి.!
Vivo Y300 5G : ఫీచర్స్
వివో ఈ కొత్త ఫోన్ ను Snapdragon 4 Gne 2 చిప్ సెట్ తో అందించింది దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.
ఈ వివో ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. వై300 5జి ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.