vivo S18 Series Launch: మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న వివో.!

Updated on 12-Jul-2024
HIGHLIGHTS

vivo S18 Series నుండి మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను డిసెంబర్ 14 న లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది

భారీ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేయబొతున్నట్లు అనౌన్స్ చేసింది

ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో vivo S18 Series నుండి మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. వివో తీసుకు వస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను డిసెంబర్ 14 న లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. వివో ఎస్18 సిరీస్ నుండి వివో ఎస్18, వివో ఎస్18 ప్రో మరియు వివో ఎస్18ఈ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. వివో ఎస్18 స్మార్ట్ ఫోన్లనుభారీ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేయబొతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.

vivo S18 Series Launch

వివో ఎస్18 సిరీస్ ను చైనాలో లాంచ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో ఎస్18 సిరీస్ ఫోన్ లను చైనా మార్కెట్ లో డిసెంబర్ 14వ తేదీ చైనా కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (ఇండియా టైమ్ 4:30pm) కి లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుండి మూడు ఫోన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వివో, ఈ ఫోన్ల యొక్క కీలకమైన స్పెషిఫికేషన్ లను కూడా టీజింగ్ ద్వారా విడుదల చేసింది.

వివో ఎస్18ఈ

వివో చైనా అధికారిక వెబ్సైట్ నుండి ఈ ఫోన్ ల స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ముందుగా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫోన్స్ ఎలా ఉన్నాయి ఒక లుక్కేద్దామా.

Also Read : WhatsApp: ఇండియాలో 75 లక్షల అకౌంట్స్ తొలగించిన వాట్సాప్.!

వివో ఎస్18 సిరీస్ లో వివో ఎస్18 [ప్రో ప్రీమియం ఫీచర్స్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9200+ ప్రోసెసర్ తో వస్తోంది. ఇందులో 50MP VCS బయోనిక్ Sony IMX920 కెమేరా సెటప్ వుంది. అంతేకాదు, ఇందులో మరో రెండు ప్రీమియం సెన్సార్ లను కూడా కలిగి వుంది. మొత్తానికి ఈ ఫోన్ లో అందించిన కెమేరా సెటప్ ఇటీవల చైనాలో వివో విడుదల చేసిన వివో X1000 ను పోలి ఉన్నట్లు చెప్పవచ్చు.

వివో ఎస్18

ఇక ఈ సిరీస్ నుండి రానున్న మరో రెండు ఫోన్ల విషయానికి వస్తే, వివో ఎస్18 ఫోన్ Snapdragon 7 Gen 3 ప్రోసెసర్ మరియు 5000 mAh బ్యాటరీతో వస్తున్నట్లు తెలిపింది. వివో ఎస్18ఈ ఫోన్ ను 80W వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4800 mAh బ్యాటరీతో తీసుకు వస్తున్నట్లు వివో తెలిపింది.

వివో చైనా వెబ్సైట్ నుండి కంపెను అందించిన వివరాల ప్రకారం ఈ కొత్త సిరీస్ ను భారీ ఫీచర్స్ తీసుకు వస్తున్నట్లు అర్ధమవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :