వివో తన X 23 ని అధికారకంగా విడుదల చేయనున్నట్లు తన చైనీస్ వెబ్సైటులో ఫోన్ లిస్టింగ్ ని ఉంచింది

వివో తన X 23 ని అధికారకంగా విడుదల చేయనున్నట్లు తన చైనీస్ వెబ్సైటులో ఫోన్ లిస్టింగ్ ని ఉంచింది
HIGHLIGHTS

లిస్టింగ్ ప్రకారం, వివో X23 స్మార్ట్ ఫోన్ ఒక "వాటర్ డ్రాప్" నోచ్, ఒక రియర్ డ్యూయల్ - కెమెరా సెటప్ మరియు ఇన్ - డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది.

వివో మరియు ఒప్పో ఇటీవలే కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్లలో పాప్ అప్ కెమెరాలతో కొత్త ఒరవడిని సృష్టించాయి. ఇంకా చుస్తుంటే ఇప్పుడు రెండు కంపెనీలు కూడా కొత్త రకాలైన ఫోన్స్ తో స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కొత్త ట్రేన్డ్ ని సెట్ చేసేలా వున్నాయి. ముందుగా ముఖ్యమైన ఫోన్లను గురుంచి మాట్లాడితే , ఒప్పో తన R17, R17 Pro, F9 మరియు F9 Pro స్మార్ట్ ఫోన్ల కోసం  వాటర్ డ్రాప్ డిజైన్ ని అందిస్తున్నట్లు అడ్వేర్టైజ్ చేసింది. ఈ లిస్ట్ లో వివో X23 ఇప్పుడు కొత్త వాటి సరసన కొత్తగా వచ్చిచేరింది.ఈ స్మార్ట్ ఫోన్ వివో యొక్క అధికారిక చైనా వెబ్సైట్ లో లిస్ట్ చేయబడింది.

ఈ వెబ్ సైట్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ "వాటర్ డ్రాప్" నోచ్ డిస్ప్లే తో వస్తాయి, దీని ద్వారా 91.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోని పొందవచ్చు. ఒక సన్నని చిన్ తో పాటుగా ఈ  స్మార్ట్ ఫోన్  ఒక అంచు నుండి మరో అంచు వరకు పూర్తి డిస్ప్లే ఉంది. వెనుకవైపు, ఫోన్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉంచిన నిలువుగా అమర్చిన AI- ఆధారిత డ్యూయల్ కెమెరా మాడ్యూల్ ఉంది. కెమెరాల క్రింద, ఒక LED ఫ్లాష్ కూడా ఇవ్వబడింది మరియు ఒక  ఫింగర్ ప్రింట్ స్కానర్ డివైజ్లో చూడవచ్చు. వివో X23 తాజా డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్  స్కానర్తో వస్తుంది. ఇతర అన్లాకింగ్ కి ఎంపికగా ఆధునిక 3D పేస్ అన్లాక్ కూడా ఉంటుంది.

ఫోన్ అంతర్గతంగా, వివో X23 8జీబీ ర్యామ్ తో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ తో  వస్తుంది . వెబ్ సైట్ లోని చిత్రాలు రెండు రంగులలో ఫోన్ ని చూపిస్తుంది: పర్పుల్ మరియు పింక్. నోచ్ మినహా, వివో X23 ,X21 వలె అదే నమూనాను కలిగి ఉంది. 19: 9 యాస్పెక్ట్ రేషియో గల ఒక 6.28 అంగుళాల ఫుల్ హెచ్ డి+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వివో X21 విడుదలైంది. ఇది స్నాప్ డ్రాగన్ 660 SoC  మరియు 6జీబీ ర్యామ్ తో వస్తుంది, ఇది  128జీబీ అంతర్గత స్టోరేజీ తో కలిపి ఉంది. ఆప్టిక్స్ పరంగా చుస్తే, వివో X21 12ఎంపీ  ప్రాధమిక సెన్సార్ మరియు ఒక 5ఎంపీ సెకండరీ సెన్సార్తో  నిలువుగా అమర్చిన ఒక రియర్ డ్యూయల్ – కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ముందు, ఒక 12ఎంపీ సెన్సార్ ని  కలిగి ఉంది. ఈ ఫోన్ కి ఒక 3,200mAh బ్యాటరీ మద్దతుగా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo