Vivo V25 5G:మరొక కలర్ ఛేంజింగ్ ఫోన్ ను లాంచ్ చేస్తున్న వివో.!

Updated on 11-Sep-2022
HIGHLIGHTS

Vivo V25 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్న వివో

రంగులు మార్చే కలర్ ఛేంజింగ్ గ్లాస్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది

Flipkart ను ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది

వివో V25 సిరీస్ నుండి ఇటీవల లాంచ్ చేసిన వివో వి25 ప్రో యొక్క డౌన్ టోన్ వెర్షన్ ను విడుదల చేస్తోంది. అదే వివో వి25 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కూడా వెనుక ట్రిపుల్ కెమెరా మరియు వెనుక రంగులు మార్చే కలర్ ఛేంజింగ్ గ్లాస్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది, Flipkart ను ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా వ్యహరిస్తుందని మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ యొక్క  రివీల్డ్ మరియు అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో సవివరంగా చూద్దాం.

వివో ఇప్పటికే టీజింగ్ ద్వారా కొన్ని ఫీచర్లను వెల్లడించింది. కంపెనీ వైబ్సైట్ నుండి అందించిన టీజింగ్ పేజ్ ద్వారా, వివో వి25 కూడా ప్రో మాదిర్తిగానే వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో వస్తోంది. అయితే, ఇది కేవలం సర్ఫింగ్ బ్లూ కలర్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ను భారీ 50MP Eye AF సెల్ఫీల కెమెరాతో  తీసుకువస్తున్నట్లు కూడా వివో పేర్కొంది. దీని ద్వారా ఎల్లప్పుడూ మీ పైన సరైన ఫోకస్ ఈ కెమెరా అందిస్తుంది.

వివో వి25 5జి యొక్క రియర్ కెమెరా గురించి కూడా వివో తెలిపింది. ఈ ఫోన్ లో కూడా ప్రో మాదిరిగా ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. అలాగే, OIS సపోర్ట్ కలిగిన 64MP నైట్ కెమెరాని ఈ ఫోన్ లో జతచేసింది. అయితే, మిగిలిన రెండు సెన్సార్ ల గురించి మాత్రం కంపెనీ తెలుపలేదు. ఈ ఫోన్ లో 8GB వరకూ ఎక్స్ టెండేడ్ ర్యామ్ సపోర్ట్ ను అందించినట్లు వివో టీజింగ్ ద్వారా తెలిపింది. అయితే, ఇది ర్యామ్ వేరియంట్ ను బట్టి మారవచ్చు. వివో తన అప్ కమింగ్ ఫోన్ V25 గురించి ప్రస్తుతం వెల్లడించిన ఫీచరాలు ఇవే.

అయితే, మార్కెట్ వర్గాలు ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్  FuntouchOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేసే ఆండ్రాయిడ్ 12 తో ఈ ఫోన్ ను విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :