Vivo T3 Lite 5G: కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

Updated on 20-Jun-2024
HIGHLIGHTS

ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది

Vivo T3 Lite 5G ఫోన్ లాంచ్ అనౌన్స్ తో ఆటపట్టిస్తోంది

ఈ ఫోన్ లో Sony AI కెమెరా ఉన్నట్లు కంపెనీ తెలిపింది

Vivo T3 Lite 5G: ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. 2024 మార్చి నెలలో వివో టి సిరీస్ నుంచి T3 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వివో, ఇప్పుడు ఈ సిరీస్ రెండు లైట్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో పాటుగా ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా ఒక్కొక్కటిగా రివీల్ చేయనున్నట్లు ఆటపట్టిస్తోంది.

Vivo T3 Lite 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

Vivo T3 Lite 5G

వివో యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జూన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, అతి త్వరలో ఈ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపే ‘Coming Soon’ ట్యాగ్ తో ఆటపట్టిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ టీజర్ పేజీ నుండి ఫీచర్స్ రివీల్ చేసే డేట్ లను కూడా అందించింది. Flipkart నుండి ఈ ఫోన్ లాంచ్ టీజర్ పేజి ని అందించింది మరియు ఈ పేజీ నుండి టీజింగ్ చేస్తోంది.

Vivo T3 Lite 5G ఫీచర్స్ ఏమిటి?

ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క ఫీచర్లను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ పేజి ద్వారా ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ కనిపిస్తోంది. Flipkart టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ డైజిన్ వివరాలను అందించింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా సన్నని స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతోంది.

Also Read: Realme GT6: ఈ టాప్-5 ఫీచర్లతో వచ్చిన రియల్ మీ ఫ్లాగ్ షిప్ ఫోన్.!

ఇక ఈ ఫోన్ టీజర్ పేజ్ లో చూపించిన ఫీచర్ రివీల్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity ప్రోసెసర్ తో ఉంటుందని అర్థం అవుతోంది. అయితే, ఈ ఫీచర్ ను కంపెనీ ఇంకా రివీల్ చెయ్యలేదు, ఇది జూన్ 24న రివీల్ చేయబడుతుంది. ఈ ఫోన్ లో Sony AI కెమెరా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఇది ఎటువంటి సెన్సార్ మరియు దీని జతగా అందించిన రెండవ కెమెరా వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ఈ సిరీస్ నుండి ముందుగా వచ్చిన T3 డౌన్ గ్రేడ్ వెర్షన్ గా వస్తుంది కాబట్టి ఫీచర్స్ కూడా బాగానే వుండే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :