ViVO V25 ను రేపు లాంచ్ చేస్తున్న వివో.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Updated on 14-Sep-2022
HIGHLIGHTS

రేపు ఇండియాలో వివో V25 5G ని లాంచ్ చేస్తున్న వివో

వివో వి25 5G కూడా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి వుంది

ఈ ఫోన్ సెల్ఫీ ప్రియులను ఆకర్షించేలా 50MP Eye AF కెమెరాతో ఈ ఫోన్ ను తీసుకువస్తోంది

ఇండియాలో మరొక కలర్ ఛేంజింగ్ స్మార్ట్ ఫోన్ ను అదే సిరీస్ నుండి లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతున్న వివో సంస్థ. అదే, వివో V25 5G మరియు ఈ ఫోన్ ను కూడా వివో వి25 ప్రో మాదిరిగా వెనుక కలర్ ఛేంజింగ్ గ్లాస్ తో తీసుకు వస్తోంది. ఇదొక్కటే ఈ రెండు ఫోన్ల మధ్య సారూప్యత అని మాత్రం అనుకోకండి. వివో వి25 5G కూడా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. అంతేకాదు, సెల్ఫీ ప్రియులను ఆకర్షించేలా 50MP Eye AF కెమెరాతో ఈ ఫోన్ ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ఎటువంటి డీటెయిల్స్ తో వస్తోందో చూద్దామా.               

వివో ఇప్పటికే టీజింగ్ ద్వారా కొన్ని ఫీచర్లను వెల్లడించింది. కంపెనీ వైబ్సైట్ నుండి అందించిన టీజింగ్ పేజ్ ద్వారా, వివో వి25 కూడా ప్రో మాదిర్తిగానే వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో వస్తోంది. అయితే, ఇది కేవలం సర్ఫింగ్ బ్లూ కలర్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ను భారీ 50MP Eye AF సెల్ఫీల కెమెరాతో  తీసుకువస్తున్నట్లు కూడా వివో పేర్కొంది. దీని ద్వారా ఎల్లప్పుడూ మీ పైన సరైన ఫోకస్ ఈ కెమెరా అందిస్తుంది.

వివో వి25 5జి యొక్క రియర్ కెమెరా గురించి కూడా వివో తెలిపింది. ఈ ఫోన్ లో కూడా ప్రో మాదిరిగా ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. అలాగే, OIS సపోర్ట్ కలిగిన 64MP నైట్ కెమెరాని ఈ ఫోన్ లో జతచేసింది. అయితే, మిగిలిన రెండు సెన్సార్ ల గురించి మాత్రం కంపెనీ తెలుపలేదు. ఈ ఫోన్ లో 8GB వరకూ ఎక్స్ టెండేడ్ ర్యామ్ సపోర్ట్ ను అందించినట్లు వివో టీజింగ్ ద్వారా తెలిపింది. అయితే, ఇది ర్యామ్ వేరియంట్ ను బట్టి మారవచ్చు. వివో తన అప్ కమింగ్ ఫోన్ V25 గురించి ప్రస్తుతం వెల్లడించిన ఫీచరాలు ఇవే.

అయితే, మార్కెట్ వర్గాలు ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్  FuntouchOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేసే ఆండ్రాయిడ్ 12 తో ఈ ఫోన్ ను విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :