వివో కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. వివో లేటెస్ట్ గా ఇండియాలో Vivo Y22 ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ vivo.com, ఆన్లైన్ స్టోర్స్ మరియు ఇతర అధీకృత రిటైల్ స్టోర్ లలో కూడా అందుబాటులో ఉంటుంది. వివో వై 22 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టైలిష్ డిజైన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.
వివో వై22 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB+64GB) ధరను రూ.14,499 రూపాయల ధరలో ప్రవేశపట్టబడింది. ఈ ఫోన్ స్టార్ లిట్ బ్లూ మరియు మెటావర్స్ గ్రీన్ అనే రెండు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ పైన అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా SBI, Kotak మహీంద్రా మరియు వన్ క్రెడిట్ కార్డ్స్ పైన రూ.1,000 క్యాష్‌బ్యాక్ మరియు ఆన్‌లైన్ కొనుగోళ్ల పై రూ.750 క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ HD రిజల్యూషన్ LCD డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G70 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారమైన Funtouch OS 12 సాఫ్ట్‌వేర్ పైన నడుస్తుంది.
ఇక కెమెరాలు మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఈ ఫోన్ వెనుక 50MP మరియు 2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. అలాగే ముందు 8MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.