Vivo Y22 ను స్టైలిష్ డిజైన్ మరియు 50MP కెమెరాతో లాంచ్ చేసిన వివో.!

Vivo Y22 ను స్టైలిష్ డిజైన్ మరియు 50MP కెమెరాతో లాంచ్ చేసిన వివో.!
HIGHLIGHTS

వివో కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్

వివో లేటెస్ట్ గా ఇండియాలో Vivo Y22 ను విడుదల చేసింది

ఈ ఫోన్ Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టైలిష్ డిజైన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది

వివో కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. వివో లేటెస్ట్ గా ఇండియాలో Vivo Y22 ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్  vivo.com, ఆన్లైన్ స్టోర్స్ మరియు ఇతర అధీకృత రిటైల్ స్టోర్‌ లలో కూడా అందుబాటులో ఉంటుంది. వివో వై 22 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టైలిష్ డిజైన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.  

Vivo Y22: ధర

వివో వై22 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB+64GB) ధరను రూ.14,499 రూపాయల ధరలో ప్రవేశపట్టబడింది. ఈ ఫోన్ స్టార్‌ లిట్ బ్లూ మరియు మెటావర్స్ గ్రీన్ అనే రెండు అందమైన కలర్ ఆప్షన్‌ లలో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ పైన అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా SBI, Kotak మహీంద్రా మరియు వన్ క్రెడిట్ కార్డ్స్ పైన రూ.1,000 క్యాష్‌బ్యాక్ మరియు ఆన్‌లైన్ కొనుగోళ్ల పై రూ.750 క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

Vivo Y22: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ HD రిజల్యూషన్ LCD డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G70 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారమైన Funtouch OS 12 సాఫ్ట్‌వేర్ పైన నడుస్తుంది.

ఇక కెమెరాలు మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఈ ఫోన్ వెనుక 50MP మరియు 2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. అలాగే ముందు 8MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్,  టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo