vivo Y39 5G ఫోన్ ను సైలెంట్ విడుదల చేసిన వివో.. ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

చడీ చప్పుడు లేకుండా vivo Y39 5G ఫోన్ ను చేసిన వివో
సరికొత్త డిజైన్, క్వాల్కమ్ బడ్జెట్ పవర్ ఫుల్ చిప్ మరియు Sony కెమెరాతో వచ్చింది
ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి Flipkart, Amazon, వివో స్టోర్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది
vivo Y39 5G: చడీ చప్పుడు లేకుండా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అదే, vivo Y39 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సేల్ కూడా ప్రారంభించింది. 2025 ఫిబ్రవరి నెలలో మలేషియా మార్కెట్లో ముందుగా ఈ ఫోన్ విడుదల చేసిన వివో, ఇప్పుడు ఈ ఫోన్ ను ఇండియాలో కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్, క్వాల్కమ్ బడ్జెట్ పవర్ ఫుల్ చిప్ మరియు Sony కెమెరా వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
vivo Y39 5G : ప్రైస్
వివో వై 39 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో 8GB + 128GB బేసిక్ వేరియంట్ రూ. 16,999 ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ రూ. 16,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి Flipkart, Amazon, వివో స్టోర్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.
ఆఫర్స్ :
వివో వై 39 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పై రూ. 1,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
Also Read: Motorola Edge 50 Fusion పై భారీ తగ్గింపు అందించిన అమెజాన్ .. కొత్త రేటు ఎంతంటే.!
vivo Y39 5G : ఫీచర్స్
ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో వస్తుంది మరియు జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ఎక్స్ పాండబుల్ ర్యామ్ తో టోటల్ 18GB ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ వివో కొత్త ఫోన్ 6.68 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 60/90/120 Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
ఈ వివో ఫోన్ 50MP సోనీ ప్రధాన కెమెరా జతగా 2MP డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI ఎరేజ్ మరియు AI ఫోటో ఎన్ హెన్మెంట్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ EIS సపోర్ట్ కలిగి మంచి స్టేబుల్ వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ సెగ్మెంట్ లీడింగ్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పై ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ MIL-STD-810H కఠినమైన డిజైన్ తో ఉంటుంది.