Vivo X21s స్మార్ట్ ఫోన్ విడుదల : డిస్ప్లే లో అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్ డ్రాగన్ 660 SoC మరియు మరెన్నో ప్రత్యేకతలతో విడుదలయ్యింది

Updated on 10-Nov-2018
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్, బెజెల్లులేని వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే ని కలిగివుంది.

వివో కంపెనీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, తన X సిరీస్ ఫోన్లలో ఒక సరికొత్త  ఫోన్ని చైనాలో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మధ్యస్థాయి ధరలో మంచి లక్షణాలతో వస్తుందని కంపెనీ పేర్కొంది. డిస్ప్లే లో అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రతేకతను కలిగి, బెజెల్లులేని ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది ఈ Vivo X21s స్మార్ట్ ఫోన్.     

వివో X 21s ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్, డిస్ప్లే లో అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్తో 1080×2340 పిక్సెళ్ళు అందించగల ఒక 6.41- అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే ని కలిగివుంటుంది. ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC  AIE యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది మరియు దీనిని మైక్రో SD కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. అలాగే, ఒక 3400 mAh సామర్ధ్యంగల బ్యాటరీని కూడా ఈ ఫోన్లో పొందుతారు.

ఈ వివో X 21s ఫోన్ వెనుకభాగంలో, 12MP ప్రధాన కెమెరాతో జతగా 5MP కలిగిన ఒక డ్యూయల్ రియర్ కెమేరా ఉంటుంది. ముందు, ముఖగుర్తింపు మరియు AR కి సపోర్ట్ చేసే ఒక 24.8 MP కెమేరాని కలిగివుంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 నడుస్తుంది మరియు డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ ఇస్తుంది. ఈ ప్రత్యేకతలను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 6GB+128GB వేరియంట్ ధర CNY 2498 ధరతో వివో యొక్క చైనా వెబ్సైట్ లో అమ్మకాలను మొదలుపెట్టింది. అంటే ఇండియాలో దీని ధర సుమారుగా Rs 26,091 గా ఉండవచ్చు.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :