4000 mAh బ్యాటరీ మరియు 3 జీబీ స్మార్ట్ ఇంత తక్కువ ధరకు ,

Updated on 29-Apr-2017
HIGHLIGHTS

అమెరికా కు సంభందించిన ఒక స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీ Blu దీనినుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది

4000 mAh  బ్యాటరీ  మరియు  3 జీబీ  స్మార్ట్  ఇంత తక్కువ  ధరకు ,

అమెరికా  కు  సంభందించిన ఒక  స్మార్ట్  ఫోన్  మేకింగ్  కంపెనీ  Blu దీనినుంచి  ఒక కొత్త  స్మార్ట్  ఫోన్  వస్తుంది. దీనిపేరు (Blu R1 Plus)  ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్‌ ఫోన్ .  ఈ ఫోన్   అమెజాన్, బెస్ట్ బుయ్ వంటి  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్స్  లో  దీని  సేల్స్  జరగనున్నాయి.  లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ధర 50 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.3,200)

ఇక దీని  స్పెక్స్  పై  ఓ  లుక్కేస్తే 
5.5 ఇంచెస్  హెచ్దీ డిస్‌ప్లే  మరియు  కర్వ్డ్  ఆన్-సెల్ గ్లాస్ ప్యానల్‌తో వస్తోంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్  కలిగి  వుంది. ఆం డ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.మీడియాటెక్ 6731 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలీ – టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4000mAh బ్యాటరీ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :