3GB ర్యామ్ తో YU బ్రాండ్ నుండి కొత్త మోడల్ వస్తుంది

Updated on 30-Mar-2016
HIGHLIGHTS

యురేకా ప్లస్ కు అప్ గ్రేడ్ మోడల్ అని అంచనా

మైక్రో మాక్స్ సబ్ బ్రాండ్ YU గుర్తింది గా మీకు. అప్పుడప్పుడు మెరుపులా ఒక మోడల్ ను తక్కువ ప్రైస్ కో లేదో హై ఎండ్ స్పెక్స్ తోనో లాంచ్ చేసి వెంటనే ఆ డివైజ్ ఫెయిల్ అయితే కనుమరుగు అవుతుంది.

కాని మన దేశం నుండి ఇంటర్నేషనల్ మరియు చైనీస్ బ్రాండ్స్ కు గట్టి పోటీ ఇచ్చే కాన్ఫిడెన్స్, ప్రయత్నాలు చేస్తున్న ఏకైక కంపెని ఇదే. అందుకు YU ను మెచ్చుకోవాలి.

ఇప్పుడు YU మరొక మోడల్ ను లాంచ్ చేయనుంది అని తెలుస్తుంది. GFXBench మరియు ఇంపోర్టింగ్ లిస్టింగ్ సైట్ Zauba లో YU5200 పేరుతో కొత్త మోడల్ కనిపించింది.

GFXBench ప్రకారం దీనిలో స్నాప్ డ్రాగన్ 615 1.6GHz SoC, 3GB ర్యామ్, 13MP అండ్ 5MP కెమరా సెట్ అప్, ఆండ్రాయిడ్ 5.1.1 ఉన్నాయి.

దీని ప్రైస్ సుమారు 9,000 ఉంటుంది అని Zauba లిస్టింగ్ ప్రకారం తెలుస్తుంది. ఇది యురేకా ప్లస్ కు నెక్స్ట్ అప్ గ్రేడ్ మోడల్ అని రిపోర్ట్స్. యురేకా ప్లస్ లో 2GB ర్యామ్, 5.5 in డిస్ప్లే, SD 615 SoC ఉన్నాయి.

కంపెని నుండి ఆఖరిగా వహ్చిన మోడల్ Yutopia – 4GB ర్యామ్ తో oneplus 2 కు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది YU. కాని ఫెయిల్ అయ్యింది.

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :