అప్ కమింగ్ మోటో G 3 నెక్స్ట్ మోడల్ స్పెక్స్ అంత బాలేవు.

అప్ కమింగ్ మోటో G 3 నెక్స్ట్ మోడల్ స్పెక్స్ అంత బాలేవు.
HIGHLIGHTS

స్నాప్ డ్రాగన్ 410 SoC మరియు 1జిబి ర్యామ్

తాజగా మోటో G 3 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా లీక్ అవ్వటం జరిగింది. యుట్యుబ్ లో Reddit లింక్ తో లీక్ద్ స్పెక్స్ చూపించబడ్డాయి. అయితే అది ఇప్పుడు తొలిగించబడింది. కాని ఇమేజెస్ మాత్రం గూగల్ ప్లస్ లో Neo Lee ప్రొఫైల్ ద్వారా బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే మోటోరోలా త్వరలోనే ఈ ఫోన్ ను లాంచ్ చేయనుంది అని హింట్స్ వస్తున్నాయి.

లికైన ఫోటోల ద్వారా తెలిసిన విషయాలు… వెనుక డ్యూయల్ LED ఫ్లాష్ తో పాటో మోటో రెగ్యులర్ లోగో  మ్యాటీ ఫినిషింగ్ తో కాకుండా Textured లేయర్ డిజైన్ వస్తుంది దీని బ్యాక్ ప్యానల్. 4.97 ఇంచ్ HD డిస్ప్లే, (ఇది ఊహించినదే), క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 SoC ప్రోసెసర్ (610 SoC వస్తుంది అని అనుకున్నాం).

1జిబి ర్యామ్ (ఇది చాలా తక్కువ, చాలా బడ్జెట్ ఫోనుల్లో 2జిబి ర్యామ్ వస్తుంది ఇప్పుడు), 8జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 13MP డ్యూయల్ LED ఫ్లాష్ బ్యాక్ మరియు 5MP ఫ్రంట్ కెమేరా. రెండు మంచి అపగ్రేడ్ స్పెక్స్. మోటో 3rd జెనరేషన్ ఫోన్ కు మోటో వాయిస్ మరియు 2300 mah బ్యాటరీ కూడా వస్తున్నాయిఅని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇమేజ్ క్రెడిట్స్: Neo Lee

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo