భారత మార్కెట్లో వచ్చే వారం కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఈ వారం మార్కెట్లో అన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్ లు విడుదల కాగా, వచ్చే వారం మొత్తం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు విడుదల కాబోతున్నాయి. మరి వచ్చే వారం విడుదల కాబోతున్న Upcoming Mobiles లిస్ట్ ఏమిటో చూసేద్దామా.
వచ్చే వారం ఇండియన్ మార్కెట్ లో నాలుగు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రెండు ఫోన్లను Poco లాంచ్ చేస్తోంది, ఒక ఫోన్ ను రియల్ మీ మరియు ఒక ఫోన్ ను Lava లాంచ్ చేస్తోంది. ఈ నాలుగు ఫోన్స్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
పోకో నుంచి వస్తున్న అత్యంత చవకైన 5G ఫోన్ ఇదే అవుతుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 17 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్, 50MP Sony కెమెరా మరియు గొప్ప డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ను 8 వేల బడ్జెట్ ధరలో విడుదల చేస్తున్నట్లు పోకో ముందే ప్రకటించింది.
పోకో ఎం7 ప్రో స్మార్ట్ ఫోన్ ను కూడా డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ అప్ కమింగ్ పోకో ఫోన్ 2100 నిట్స్ బ్రైట్నెస్ AMOLED స్క్రీన్, 50MP Sony LYT-600 డ్యూయల్ కెమెరా, Dolby Atmos సపోర్టెడ్ డ్యూయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు Dimensity 7025 చిప్ సెట్ తో వస్తుంది.
Also Read: 15 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ కోసం చూస్తున్నారా.!
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు స్లీక్ డిజైన్ తో వస్తోంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ IP69 వాటర్ ప్రూఫ్ సపోర్ట్ తో లాంచ్ కాబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది.
లావా బ్లేజ్ డ్యూవో 5జి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది. ఇందులో 6,67 ఇంచ్ బిగ్ AMOLED మరియు 1.58 ఇంచ్ రెండవ స్క్రీన్ ఉన్నాయి. ఈ ఫోన్ 64MP Sony డ్యూయల్ కెమెరా, Dimensity 7025 చిప్ సెట్ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతుంది.
ఈ మూడు ఫోన్లు వచ్చే వారం భారత మార్కెట్ లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.