First Sale:ఈ వారంలో ఫస్ట్ సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్.!

Updated on 03-Jun-2024
HIGHLIGHTS

సరికొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్ లు ఈ వారంలో ఫస్ట్ సేల్ కి రానున్నాయి

ఈ లిస్ట్ లో మూడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి

ఈ ఫోన్ సేల్ మరియు ప్రత్యేకతలు వంటి వివరాల పై ఒక లుక్కేయండి

First Sale: గత వారం ఇండియాలో సరికొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్ లు ఈ వారంలో ఫస్ట్ సేల్ కి రానున్నాయి. ఈ లిస్ట్ లో మూడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఇందులో లావా తెచ్చిన Yuva 5G, నథింగ్ అందించిన Phone (2a) స్పెషల్ ఎడిషన్ మరియు మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ మోటో జి04s ఉన్నాయి. ఈ ఫోన్ సేల్ మరియు ప్రత్యేకతలు వంటి వివరాల పై ఒక లుక్కేద్దామా.

లావా యువ 5G First Sale

లావా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లావా యువ 5జి ఫోన్ ఈ వారంలో మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Amazon నుంచి ప్రారంభం అవుతుంది.

లావా యువ 5G First Sale

ఈ ఫోన్ ను లావా కేవలం రూ. 9,499 రూపాయల ప్రారంభ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ Unisoc T750 ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4GB+ 4GB ఫీచర్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా, పెద్ద డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ తో ఉంటుంది.

Also Read: AC Blast: పేలిపోతున్న ఏసీలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.!

నథింగ్ ఫోన్ (2) స్పెషల్ ఎడిషన్

నథింగ్ ఫోన్ (2) స్పెషల్ ఎడిషన్ ఫోన్ ను కొత్తగా నథింగ్ పరిచయం చేసింది. ఈ ఫోన్ కూడా ఈ వారంలో మొదటి సారిగా అమ్మకానికి వస్తోంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల Flipkart నుండి మొదలవుతుంది.

నథింగ్ ఫోన్ (2) స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ కేవలం 12GB +256GB వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ లో HDR డిస్ప్లే, డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్, 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 45 ఫాస్ట్ ఛార్జ్ కలిగిన 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మోటో జి04s

మోటో జి04s స్మార్ట్ ఫోన్ కూడా జస్ట్ గత వారమే ఇండియాలో విడుదలయ్యింది. ఈ ఫోన్ ను కంపెనీ కేవలం రూ. 6,999 ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా జూన్ 5న మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఈ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ HD+ స్క్రీన్, 50MP రియర్ కెమెరా, 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :