20 వేల కంటే తక్కువ ధరతో ‘వివో వి9 ప్రో’ 6జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 660 SoC తో విడుదలైంది

20 వేల కంటే తక్కువ ధరతో ‘వివో వి9 ప్రో’ 6జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 660 SoC తో విడుదలైంది
HIGHLIGHTS

వివో రూ .17,990 ధరలో గేమ్ మోడ్ మరియు బైక్ మోడ్ ని ఈ స్మార్ట్ ఫోన్లో ప్రధాన లక్షణాలుగా చేర్చింది. ఈ ఫోన్ అమేజాన్ గ్రేట్ ఇండియా సేల్ లో అందుబాటులో వుంటుంది.

20,000 రూపాయల ఉప -విభాగంలో తన V- సిరీస్ స్మార్ట్ ఫోన్ విస్తరణలో భాగంగా , వివో తన 'వి9 ప్రో'  స్మార్ట్ ఫోన్ ని క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 6జీబీ ర్యామ్ తో ప్రారంభించింది. ఈ హ్యాండ్సెట్ ధర రూ .19,990 గా ఉండగా, అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో రూ. 17,990 ప్రత్యేక ధరతో నలుపు రంగులో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో బైక్ మోడ్ మరియు గేమ్ మోడ్ వంటి కొన్ని వినియోగదారు – సెంట్రిక్ లక్షణాలతో ఫోన్ వస్తుంది. వివో  తెలిపి ప్రకారం,  వి9 ప్రో "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ నోయిడాలో ఉన్న, వివో మానిఫెక్చరింగ్ యూనిట్ సౌకర్యంతో తయారు చేయబడింది.

"ఇన్నోవేషన్ మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం ఎల్లప్పుడూ వివో యొక్క వ్యూహంలో ప్రధానాంశంగా ఉంటుంది మరియు మా కృతనిశ్చయ  వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను ఉత్తమంగా అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. వివో వి9 ప్రో ని, అన్ని అంశాలతో ఆల్రౌండ్ గా అందించాలని  ఆశిస్తున్నాము, శక్తివంతమైన పనితీరు మద్దతు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ మంచి అనుభవంతో పాటుగా సరసమైన ధర మరియు విశ్వసనీయత అందిస్తుందని, " వివో ఇండియా CMO అయిన,  జెరోమ్ చెన్, ఒక ప్రకటనలో తెలిపారు.

వివో వి9 ప్రో –  ప్రత్యేకతలు (స్పెసిఫికేషన్స్) మరియు లక్షణాలు (ఫీచర్స్)

వి9 ప్రో  90 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 19: 9 కారక నిష్పత్తితో 6.3 అంగుళాల పూర్తి HD + పూర్తి వీక్షణా డిస్ప్లే ని కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షించబడుతోంది. ఈ స్మార్ట్ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రాసెసర్ చే శక్తినిస్తుంది, అలాగే ఇది 6జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత నిల్వతో కలిపి ఉంటుంది, దీనిని 256జీబీ వరకు విస్తరించవచ్చు SD కార్డు ద్వారా. ఇది 3260mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో ఆధారంగా ఫన్ టచ్ 4.0 OS పై నడుస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే, వి9 ప్రో ఒక ప్రాధమిక డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ గా  f /2.2 ఎపర్చరు 13MP లెన్స్తో మరియు f /2.4 ఎపర్చరు కలిగిన ఒక 2MP లతో ఉంటుంది. ఈ రెండు కేమెరాలు కూడా ఓమ్నివిజన్ OV13855 సెన్సార్ను కలిగి ఉంటాయి. ఈ రియర్(వెనుక) కెమెరా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్-శక్తితో బొకే ఎఫెక్ట్ తో   చిత్రాలను క్లిక్ చేయవచ్చు. వెనుక కెమెరా, అల్ట్రా HD మరియు AR స్టికర్లు వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తుంది. ముందు భాగంలో, F2.0 ఎపర్చరుతో శామ్సంగ్ S5K3P9 సెన్సార్తో కూడిన ఒక 16MP ముందు కెమెరా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo