రీసెంట్ గా లాంచ్ అయిన ఆపిల్ ఐ ఫోన్ 6S ను కొనటానికి, చైనాలోని ఇద్దరు వ్యక్తులు, Huang మరియు Wu తమ సొంత కిడ్నీ లను అమ్మటానికి ప్రయత్నం చేసారు.
కొనేందుకు డబ్బులు సరిపడా లేవని, తన మిత్రుని సలహా మేరకు Wu అనే వ్యక్తి ఈ నిర్ణయానికి వచ్చాడు అంట. సో కిడ్నీ అమ్మి వచ్చే డబ్బులతో ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్ కొనవచ్చు అని వాళ్ల ప్లాన్.
ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఒక illegal ఏజెంట్ ను కూడా ఆశ్రయించారు. అతను Nanjing అనే హాస్పిటల్ లో మెడికల్ పరిక్షలు చేసుకోమని అడగటం జరిగింది. అయితే సెప్టెంబర్ 12 న జరగవలసిన ఈ టెస్ట్స్ కోసం ఏజెంట్ హాస్పిటల్ కు రాలేదు.
దానితో వీల్లిద్దరూ తాము ముందు అనుకున్న పనిని చేయటానికి మొగ్గ చూపించలేదు.కానిHuang అనే వ్యక్తి మాత్రం ఆ నిర్ణయాన్ని వదలలేదు. దానితో తప్పక Wu పోలిస్ కు కాల్ చేయటంతో ఈ విషయం అంతా బయట పడింది. అయితే అప్పటినుండి Huang ఇప్పటివరకూ కనపడటం లేదు.