2018 ఇండియాలోని Top Best 5 స్మార్ట్ ఫోన్లు
ఒక స్మార్ట్ ఫోన్ అన్నింటి కన్నా గొప్పగా ఉండాలంటే మనం అందులో ముందుగా మనం గమనించాల్సిన అంశాలు ఏమిటి?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మనజీవితంలో ఒక భాగంగా మారిపోయింది అటువంటి ఒక స్మార్ట్ ఫోన్ అన్నింటి కన్నా గొప్పగా ఉండాలంటే మనం అందులో ముందుగా మనం గమనించాల్సిన అంశాలు ఏమిటి?. ఒక స్మార్ట్ ఫోన్ దాదాపుగా ఒక ఎంట్రీ లెవల్ ల్యాప్ టాప్ వంటి లక్షణాలతో ఒక స్మార్ట్ ఫోన్ పనిచేస్తే, నిజంగా అంతకంటే ఏమికావాలి. స్ప్రెడ్ షీట్స్ ఎడిట్ చేయడం, HDR కంటెంట్ వీడియోలను ప్లే చేయడం వంటి చేయగిలిగితే, స్మార్ట్ ఫోన్ శక్తివంతమైనదే అని చెప్పుకోవచ్చు. అలాగే, ఎలాంటి అంతరాయం లేకుండా మల్టి టాస్క్, రెగ్యులర్ అప్డేట్స్ మరియు అద్భుతమైన ఫోటోలను తీయగలిగేలా ఆ స్మార్ట్ ఫోన్. ఇండియాలో అందుబాటులోవున్న అటువంటి టాప్ బెస్ట్ 15 స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం.
1. Apple iPhone XS Max
ఇది కేవలం బెస్ట్ ఫోన్ మాత్రమే కాదు చాలా ఖరీదైనది కూడా, కానీ ఈ ఫోనుతో ఒక మీరు బెస్ట్ డిస్ప్లేని అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.5 అంగుళాల HDR డిస్ప్లే మరియు AI టాస్కులను సమర్ధవంతంగా నిర్వహించగల ఒక డేడికేటెడ్ న్యూరల్ ఇంజిన్ తో కూడిన ఆపిల్ A12 బయోనిక్ చిప్ ఇందులో అందించబడింది. ఈ ఫోన్ వెనుక భాగంలో12MP+12MP డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది మరియు ఇది ఫీల్డ్ యొక్క డెప్త్ ని పసిగట్టడంలో గొప్పగా ఉంటుంది.
2. Samsung Galaxy Note 9
ప్రస్తుతం మార్కెట్లోవున్న ఆండ్రాయిడ్ డివైజ్లలో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు ఈ శామ్సంగ్ గేలక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ను. ఒక పొడవైన 6.4 అంగుళాల ప్రకాశవంతమైన డిస్ప్లేతో వస్తుంది ఈ ఫోన్ మరియు ఒక మ్యాజిక్ S తో ఈ శామ్సంగ్ గేలక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ గొప్పగా పనిచేయడమే కాకుండా అద్భుతమైన లుక్స్ తో ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 12MP+12MP డ్యూయల్ కెమేరాతో ఫోటోలను సమర్ధవంతంగా తీస్తుంది.
3. Google Pixel 3 XL
గూగుల్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 3 XL మీకు బెస్ట్ ఆండ్రాయిడ్ అనుభవానిస్తుంది మరియు దీని డిజైన్ చాలా చక్కగా మరియు క్లీన్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవదు మరియు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, స్పష్టతతో ఎటువంటి మార్పులేని జూమ్, ఫోకస్ ట్రాకింగ్, వైడ్ యాంగిల్ సెల్ఫీ మరియు మరిన్ని ఇతర లక్షణతో ఉంటుంది.
4. Samsung GalaxyS9+
ఒక పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ఈ శామ్సంగ్ గేలక్సీ S9+ బాగా సరిపోతుంది. ఇది ఒక 6.2 అంగుళాల QHD రిజల్యూషన్ డిస్ప్లే తో ఉంటుంది. దీని అమోల్డ్ చూడడానికి చక్కగా ఉంటుంది మరియు దీని Exnoys 8895 SoC టాస్కింగ్ ను స్మూత్ గా చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 12MP+12MP డ్యూయల్ రియర్ కెమెరాతో మంచి ఫోటోలు తీసుకోవడానికి సహకరిస్తుంది.
5. Huawei Mate 20 Pro
హువావే, తన ప్రమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ అయినటువంటి " Huawei Mate 20 Pro" ని ఇండియాలో విడుదల చేసింది. 7nm చిప్ మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కలిగిన మొదటి ఫోనుగా, ఈ ఫోన్ రెండు గొప్ప ఫిచర్లను తీసుకువస్తుంది. అలాగే, ఈ ఫోన్ Leica వైడ్ యాంగిల్ లెన్సుతో డ్యూయల్ – NPU Leica ట్రిపుల్ కెమేరా మరియు 40 W హై స్పీడ్ ఛార్జింగ్ చేయగల హువావే యొక్క సూపర్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది.