రోజురోజకి స్మార్ట్ఫోన్లు మరింత శక్తివంతమైనవిగా మారడంతో, వేగమైన మరియు శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ను మీ సొంతం చేసుకోవడనికి ఇప్పుడు ఎక్కువ డబ్బుని ఖర్చుపెట్టాల్సిన అవసరంలేదు. వాస్తవానికి, మీరు రూ. 30,000 రూపాయల బడ్జెట్లో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని గొప్ప స్మార్ట్ ఫోన్లను మీరు పొందవచ్చు. కాబట్టి, రూ. 30,000 కంటే తక్కువ ధరలో ప్రస్తుతం అందుబాట్లోవున్న టాప్ 5 ఫోన్లను ఇప్పుడు చూద్దాం.
ఈ జాబితాలో ఐదవ స్థానం నుండి మొదటి స్థానానికి వరుసక్రంలో ఇవ్వబడ్డాయి.
5. హానర్ ప్లే
మీరు ఒక గేమర్ అయితే, మీరు ఎంచుకోవడానికి హానర్ ప్లే సరిగ్గా ఉంటుంది. ఈ బడ్జెట్లో స్మూత్ గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించబడింది. ఇది ఒక ప్రధాన ప్రాసెసర్ మరియు Huawei యొక్క సొంత GPU టర్బో కలిగి, PubG వంటి భారీ మొబైల్ గేములను చాల సున్నితంగా చేస్తుంది.
4. నోకియా 7 ప్లస్
ఒక ధృఢమైన నిర్మాణం మరియు ప్యూర్ స్టాక్ Android తో, నోకియా 7 ప్లస్ రూ. 30,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులోవున్నా ఒక గొప్ప ఫోన్. ఈ విభాగంలో, ఇందులో మిడ్-రేంజ్ ప్రాసెసర్ మరియు Carl Zeiss కెమెరాలు ఉంటాయి. నోకియా 7 ప్లస్ స్మార్ట్ ఫోనులో పనిచేయడం ఒక అవాంతరం లేని అనుభవాన్నిస్తుంది.
3. నోకియా 8.1
నోకియా 8.1 ను అద్భుతమైన డిస్ప్లే మరియు వెనుక కెమెరాల కోసం గొప్ప ఎంపికగా ఉంటుంది. ఇది ఇతర నోకియా ఫోన్ల వలనే అదే స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తున్నప్పటికీ, నోకియా 8.1 మరింత శుద్ధంగా మరియు క్లాస్సిగా అనిపిస్తుంది.
2. Poco F1
మీరు ఒక ఫంకీ డిజైన్ కోసం కాకుండా, మంచి పెరఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలంటే, Poco F1 ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోవున్న, ప్రధాన స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ మరియు ఒక లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో పాటు, ఈ Poco F1 రూ. 30,000 కంటే తక్కువ ధరలో గొప్ప పెరఫార్మన్స్ ఇస్తుంది.
1. ఆసూస్ జెన్ఫోన్ 5z
ఈ ఆసూస్ జెన్ఫోన్ 5z ఒక ఐఫోన్ X లాగా కనిస్తుంది కానీ ఇది అద్భుతమైనది మరియు ఆఫ్ టాప్ లైన్ స్పెక్స్ మరియు ఒక క్లాస్సి డిజైన్ కలిగిన ఒక Android ఫోన్. జెన్ఫోన్ 5z అనేది ఈ ధరలో వైడ్ -యాంగిల్ లెన్సును అందించే ఏకైక ఫోన్, ఇది ఈ ఫోనును చాలా ప్రత్యేకమైనదిగా చేస్తుంది.