రూ.20,000 బడ్జెట్ లో ఇండియాలోని టాప్-5 స్మార్ట్ ఫోన్స్..!!

Updated on 30-Aug-2022
HIGHLIGHTS

కేవలం రూ.20,000 రూపాయల బడ్జెట్ లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

ఆల్ రౌండ్ ప్రతిభతో పాటుగా గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ ఫోన్లు

2022 సంవత్సరం చాలా స్మార్ట్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించబడ్డాయి

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.20,000 రూపాయల బడ్జెట్ లో వెతుకుతున్న వారికీ సహాయం చేసేందుకు ఈరోజు మనం 20 వేల ధరలో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అందిస్తున్నాను. 2022 సంవత్సరం చాలా స్మార్ట్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించబడ్డాయి. అయితే, వాటిలో ఆల్ రౌండ్ ప్రతిభతో పాటుగా గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ ఫోన్లు గా పేరుపొందిన వాటిలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఏవో, ఈరోజు చుడనున్నాము. మరి ఆ టాప్ 5 స్మార్ట్ ఫోన్లు వాటి విశేషాలు ఏమిటో తెలుసుకోండి.

1. Redmi Note 11 Pro+ (Buy Here)

రెడ్ మి నోట్ 11 ప్రో+ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 108MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను కలిగివుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది.

2. Redmi Note 11T 5G (Buy Here)

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది.

3. Moto G82 5G (Buy Here)

మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ 10బిట్ pOLED  డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన FHD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB మరియు 128GB స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.

4. Realme 9 SE 5G (Buy Here)

రియల్ మీ 9 5G SE ఫోన్ 6.6-అంగుళాల 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ను 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, DCI-P3 కలర్ గామట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ప్యాక్ చేస్తుంది. స్పీడ్ ఎడిషన్ వెనుకవైపు, 48MP ప్రధాన సెనర్ తో పాటు 2MP మాక్రో ప్లస్ మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన కెమెరా వుంది. ఈ ఫోన్ తో మీరు 30 FPS వద్ద 4K వరకు వీడియోని షూట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0, డ్యూయల్ 5G సపోర్ట్, 3.5mm జాక్, WiFi 6, బ్లూటూత్ 5.2, మొదలైన వాటితో వస్తుంది.

5. Poco X4 Pro 5G

పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సేఫ్టీతో వస్తుంది మరియు  1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 పైన రన్ అవుతుంది మరియు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా IP53 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగివుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :