ఒక ఫోన్ ఎంచుకోవడానికి మనకు చాల ఎంపికలు మార్కెట్లో అందుబాటులో వున్నాయి. కానీ, నోచ్ డిస్ప్లే మరియు పెర్ఫార్మెన్క్ పరంగా బెస్ట్ ఫోన్ల యొక్క జాబితా ఇప్పుడు ఇక్కడ అందించాము. ఇందులో, అన్ని వేరియంట్లు కూడా కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో 3GB ర్యామ్ 32GB స్టోరేజితో వస్తాయి. ఈ జాబితాలో టాప్ 5 నుండి మొదలుకొని టాప్ 1 వరకు ఈ జాబితా కొనసాగుతుంది.
5. రియల్మీ 2
ఒప్పో నుండి విడిపోయిన తరువాత రియల్మీ నుండి బడ్జెట్ ధరలో సరికొత్తగా వచ్చిన రియల్మీ 2. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.2 అంగుళాల HD+ డిస్ప్లే పైన ఒక సాధారణ నోచ్ తో వస్తుంది. అయితే, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రొసెసరుతో కొంచెం వెనకబడి వుంటుంది. కానీ, ఒక 4230 mAh బ్యాటరీతో ఈ విభాగంలో బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోనులో, 13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB/32GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.
4. రియల్మీ C1 (2019 ఎడిషన్)
రియల్మీ నుండి ఇటీవలే బడ్జెట్ ధరలో వచ్చిన ఈ రియల్మీ C1 బడ్జెట్ పరిధిలో మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.2 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక సాధారణ నోచ్ తో వస్తుంది, మరియు ఇది మీకు HD+ రిజల్యూషన్ అంధిస్తుంది. అలాగే, ఇది ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా కోర్ ప్రొసెసరుతో కొంచెం వెనుకబడి ఉంటుంది. అయితే, ఒక 4230 mAh బ్యాటరీతో మంచి బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోనులో 13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB/32GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.
3. షావోమి రెడ్మి 6 ప్రో
షావోమి నుండి బడ్జెట్ ధరలో సరికొత్తగా రెడ్మి 6 ప్రో కూడా మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ కొంచెం చిన్నదైన ఒక 5.84 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. కానీ ఇది మీకు FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు పైన ఒక చిన్న నోచ్ తో వస్తుంది. అలాగే, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రొసెసరుతో మరియు ఒక 4230 mAh బ్యాటరీతో ఈ విభాగాలలో బలంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోనులో 12MP +5MP డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB/32GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.
2. అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ M2
అసూస్ నుండి బడ్జెట్ ధరలో వచ్చిన జెన్ ఫోన్ మ్యాక్స్ M2 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.2 అంగుళాల HD డిస్ప్లే పైన ఒక సాధారణ నోచ్ తో వస్తుంది. కానీ, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రొసెసరు మరియు ఒక 4000 mAh బ్యాటరీతో ఈ విభాగాల్లో బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోనులో, 13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB/32GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.
1. శామ్సంగ్ గెలాక్సీ M10
శామ్సంగ్ నుండి ఇటీవలే బడ్జెట్ ధరలో సరికొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M10 బడ్జెట్ పరిధిలో మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇంకా, ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ ఏరియా మీకు అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది, మీకు HD+ రిజల్యూషన్ ఇది అంధిస్తుంది. అలాగే, ఇది ఒక ఎక్సీనోస్ 7870 ఆక్టా కోర్ ప్రొసెసరుతో. అయితే, ఒక 3600 mAh బ్యాటరీతో ఈ విభాగంలో కొంచెం వెనుకబడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోనులో 13MP +5MP డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3GB/32GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.