టాప్ 5 ఫోన్స్ : రూ. 15,000 కంటే తక్కువధరలో

Updated on 13-Feb-2019
HIGHLIGHTS

ఈ మధ్యకాలంలో వచ్చే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ప్రీమియం ఫోనులలో వచ్చే ఫీచర్లను తీసుకొస్తున్నాయి.

ప్రస్తుతం, ప్రతి ఒక్కరు కూడా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కోసం మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో వచ్చే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ప్రీమియం ఫోనులలో వచ్చే ఫీచర్లను తీసుకురావడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకోసమే, మార్కెట్లో అందుబాటులో వున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల లో మంచి స్పెక్స్ మరియు ఫెచర్లను అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల యొక్క జాబితా అందిస్తున్నాము.                       

5. హానర్ 8X     

గత సంవత్సరం హానర్ నుండి మిడ్ రేంజ్ సెగ్మెంట్ వచ్చింది ఈ హానర్ 8X ఫోన్.  ఈ  స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.5 అంగుళాల FHD+ డిస్ప్లే పైన ఒక సాధారణ నోచ్ తో  వస్తుంది. అయితే, ఇది ఒక కిరిణ్ 710 ప్రొసెసరుతో మరియు ఒక 3750 mAh బ్యాటరీతో కొంచెం వెనకబడి వుంటుంది. కానీ, ఇందులో GPU టర్బో అందించారు కాబట్టి మంచి గేమింగ్ మరియు పెరఫార్మెన్సు అందుకుంటారు.  ఈ స్మార్ట్ ఫోనులో, 20MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.

4. శామ్సంగ్ గెలాక్సీ M20 

శామ్సంగ్ నుండి ఇటీవలే మధ్య స్థాయి ధరలో వచ్చిన ఈ గెలాక్సీ M20 ఈ ధర పరిధిలో మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.3 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.  ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది, మరియు ఇది మీకు FHD+ రిజల్యూషన్ అంధిస్తుంది. అలాగే, ఇది ఒక కొత్త ఎక్సీనోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరు మరియు ఒక 5000mAh బయటరీతో ఈ విభాగంలోబాగానే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోనులో 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.

3. షావోమి రెడ్మి నోట్ 6 ప్రో 

షావోమి నుండి మిడ్ రేంజ్ ధరలో వచ్చిన రెడ్మి  6 ప్రో కూడా మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.26 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది మరియు  పైన ఒక చిన్న నోచ్ తో  వస్తుంది. అలాగే, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రొసెసరుతో కొంచెం వెనుకబడి ఉంటుంది.  అయితే, ఒక 4000 mAh బ్యాటరీతో మంచి బ్యాకప్ ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోనులో 12MP +5MP డ్యూయల్ కెమెరా మరియు ముందు 20MP+2MP  డ్యూయల్ సెల్ఫీ కెమేరాలతో  మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.

2. రియల్మీ U1

రియల్మీ నుండి ఇటీవలే మిడ్ రేంజిలో సరికొత్తగా వచ్చిన ఈ రియల్మీ U1 ఈ బడ్జెట్ పరిధిలో మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.3 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇంకా, ఈ డిస్ప్లే 90.8 % స్క్రీన్ టూ బాడీ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ ఏరియా మీకు అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది, మీకు FHD+ రిజల్యూషన్ ఇది అంధిస్తుంది. అలాగే, మొదటిసారిగా మీడియా టెక్ హీలియో P70 ని  ఆక్టా కోర్ ప్రొసెసరుని ఈ ఫోనుతో పరిచేయం చేసింది.  అయితే, ఒక 3500 mAh బ్యాటరీతో ఈ విభాగంలో  కొంచెం వెనుకబడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోనులో 13MP +2MP డ్యూయల్ కెమెరా మరియు ముందు Sony IMX576 సెన్సార్ తో ఒక 25MP సెల్ఫీ కెమేరాలని అందించారు, ఈ కెమెరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.

1. అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M2 టైటానియం

అసూస్ నుండి మిడ్ రేంజ్ పరిచే సెగ్మెంట్లో వచ్చిన ఈ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M2 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు ఫిచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.26 అంగుళాల FHD+ డిస్ప్లే పైన ఒక సాధారణ నోచ్ తో  వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660AIE  ప్రొసెసరు మరియు ఒక 5000 mAh బ్యాటరీతో ఈ విభాగాల్లో బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోనులో, 12MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,000 కంటే తక్కువ ధరలో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :