PubG మొబైల్ గేమ్, భారతదేశంలో ఒక గొప్ప అనుభూతిని అందించగల బెస్ట్ గేమ్ గా మారింది, కానీ అధిక పనితీరు స్మార్ట్ ఫోన్ల కోసం దీని డిమాండ్ ఇపుడు అధికమైంది. స్మార్ట్ ఫోన్ OEM లు కూడా ఈ గేము అంచనాలను మరింత పెంచాయి మరియు ఇప్పుడు బడ్జెట్ ధరలో కూడా చాలా ఫోన్లలో కూడా ఈ పవర్ అందిస్తున్నాయి. వాస్తవానికి, PubG Mobile మరియు Asphalt 9 వంటి గేమ్స్ ను నిర్వహించడం కోసం రూ .15,000 కంటే తక్కువధరలో ఉన్న ఫోన్లు కూడా సరిపోతాయి. కేవలం పనితీరు మాత్రంకాకుండా, డిస్ప్లే మరియు బ్యాటరీ సామర్థ్యంలో కూడా ఇవి మెరుగుపరచబడ్డాయి. నిజంగా విషయానికి మనం సంతోషించవచ్చు, మీకు గరిష్టంగా 15,000 రూపాయల బడ్జెట్ లో ఉన్నట్లయితే గేమింగ్ కోసం ఎటువంటి ఫోన్లు ఎంపికగా వుండనున్నాయో, ఒకసారి చూద్దాము:
5. రెడ్మి నోట్ 6 ప్రో
Xiaomi Redmi Note 6 ప్రో అనేది మిడ్ – రేంజ్ విభాగంలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ కలిగి ఉండకపోవచ్చు, కానీ అది PubG మొబైల్ వంటి భారీ గేమ్స్ నిర్వహించడానికి మంచి ఆప్టిమైజ్ కలిగివుంది. ఒక స్నాప్డ్రాగెన్ 636 మరియు 6GB RAM తో 4000mAh బ్యాటరీతో పాటు, Redmi Note 6 ప్రో మీకు ఒక గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ ఎంపికగా ఉంటుంది.
4. మోటో వన్ పవర్
మోటో వన్ పవర్ అనేది ఒక 5000 mAh బ్యాటరీతో ఉన్న ఒక ఆండ్రాయిడ్ వన్-సర్టిఫికేట్ డివైజ్, అంతేకాకుండా ఇది స్పీడ్ ఛార్జింగ్ కు మద్దతిస్తుంది. ఒక స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ శక్తితో , బడ్జెట్ ధరలో గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నవారికీ ఈ మోటో వన్ పవర్ పరిగణలోకి తీసుకోదగిన ఒక మంచి ఎంపిక.
3. రియల్మీ 2 ప్రో
రియల్మీ 2 ప్రో అనేది మీరు 15,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయగల అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఒకటి. ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ కలిగి, గేమింగ్ కోసం ఒక ఆదర్శవంతమైన ఫోనుగా ఉంటుదని. ఈ ఫోనులో మంచి గ్రాఫిక్స్నును అందించడమేకాకుండా, బెస్ట్ గేమింగ్ అనుభూతి కోసం నోటిఫికేషన్లను సైలెంట్ చేస్తూ, రిసోర్సులను పెంచే ఒక గేమింగ్ మోడ్ కూడా ఈ ఫోన్లో ఉంది.
2. ఆసుస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2
ఈ ఆసుస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా రియల్మీ 2 ప్రో వలనే అదే హార్డ్వేరుతో ఉంటుంది, కానీ ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది.ఈ ఫోన్ మీరు ఎక్కువ సమయం గేమ్ ప్లే చేయడానికి సరిపడే, ఒక భారీ 5,000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది . ఈ ఫోన్ బాగా నిర్మించబడింది మరియు దీని డిజైన్ దాని వెలుపలి భాగంలో మెరిసేలా ఉంటుంది.
1.హానర్ 8X
గేమ్స్ ప్లే కోసం ఒక ఫోన్ ఎంపిక కోసం చూస్తుంటే, హానర్ 8X మీరు కొనుగోలుచేయడాకిని ఉత్తమ ఫోన్. రూ. 15,000 కంటే తక్కువధరలో, హానర్ 8X బ్రైట్ అండ్ వైబ్రాంట్ గా ఉండే, ఒక పెద్ద 6.26-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక సరికొత్త కిరిన్ 710 ప్రోసెసును మరియు హువావే యొక్క GPU టర్బో 2.0 తో కలిపి ఉపయోగిస్తుంది, ఇది PubG మొబైల్ మరియు Asphalt 9 వంటి గేమ్లను, స్థిరంగా మరియు అధిక ఫ్రేమ్ రేట్స్ తో అందిస్తుంది.